మద్యం. మత్తు పదార్థాలను నిషేధించాలి –ఐద్వా–డివై ఎఫ్ఐ
****************
ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మద్యం. మత్తు పదార్థాలను నిషేధించాలని. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం.
అఖిలభారత ప్రజాతంత్ర యువజన సంఘం. జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రం నుండి. ముత్తుకూరు గేటు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి. షేక్ మస్తాన్ బి గారు మాట్లాడుతూ నెల్లూరు లో జరుగుతున్న వరుస దారుణ హత్యలకు నెల్లూరు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని ఈ హత్యలకు ప్రధాన మూల కారణం మద్యం మత్తు పదార్థాలనని మద్యం. మత్తు పదార్థాలు అయినటువంటి గంజాయి. వైట్నర్. సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలను సేవించి యువత వారి నైతిక విలువలు మరిచి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని తృణప్రాయంగా ప్రాణాలు తీస్తున్నారని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం పేరుతో ఉన్నటువంటి మద్యం షాపుల కన్నా 800. షాపులకు లైసెన్సులు ఇచ్చి 99 రూపాయలకే మద్యాన్ని అందిస్తూ ఏరులై పారిస్తుందని మహిళల మానప్రాణాలతో. యువకుల ప్రాణాలతో వారి భవిష్యత్తును శూన్యం చేస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుకుంటుందని ప్రజలకు రక్షణ కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నిందితులను పోలీసులు అరెస్టులు చేస్తే రాజకీయ నాయకులు వారి వారి చోటా. ముఠా లను రౌడీలను రక్షించుకోవడానికి రికమండేషన్లు చేస్తున్నారని ఇది సరైనటువంటిది కాదని మహిళల పై. మైనర్ బాలికలపై హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని కావున మద్యాన్ని. మత్తు పదార్థాలను నిషేధించాలని కోరారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ. జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ యువత మద్యం మత్తు పదార్థాల వలన చెడు దారి పట్టి వారి భవిష్యత్తును కోల్పోతున్నారని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు. పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని. మత్తు పదార్థాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవడం లేదని కావున ఈ మధ్య జరుగుతున్న నెల్లూరు లో వరుస దారుణ హత్యలను చూసి జిల్లా ప్రజలు అడవి పోతున్నారని వెంటనే అధికారులు. పాలకులు స్పందించి మద్యం. మత్తు పదార్థాలను నిషేధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు టి శివకుమారి నగర అధ్యక్ష కార్యదర్శులు కే పద్మ ఎన్.వి. సుబ్బమ్మ రూరల్ 5వ అధ్యక్షురాలు ఎస్ వరలక్ష్మి. శంషాద్. ములి ప్రమీల. కే లక్ష్మమ్మ. ఎస్ సంపూర్ణమ్మ. డివైఎఫ్ఐ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు
