*మతసామరస్యం దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ*
*మతసామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్రలో ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో వి ఆర్ సి గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది*.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ
2025 ఏప్రిల్ 22వ తేదీన పహాల్గములో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా బలిగున్నారు. దీనిని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాము.
ఉగ్రవాదులు దేశంలో మతపరమైన విభజనను తీసుకొని రావాలని, మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని పథకం పన్నారు. మన విదేశాంగ కార్యదర్శి దేశ ప్రజల మధ్య విభజన తెచ్చేందుకు దాడి జరిగిందని స్పష్టంగా ప్రకటించారు.
దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా సమైక్యంగా నిలబడి, ఉగ్ర మూకల పథకాన్ని వమ్ము చేశారు. మతోన్మాద శక్తులకు ఇది నచ్చలేదు. ఉగ్రవాదుల హత్యాకాండను, వారి విద్వేషపూరిత భావజాలాన్ని మెజార్టీ మతోన్మాదంతో ఎదురుకోలేరు. ప్రజల సమైక్యత పైన, లౌకిక విలువల పైన ఆధారపడి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కొనసాగించాలని అన్నారు.
పాకిస్తాన్లోనే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే దానికి నాయకత్వం వహించిన కల్నల్ సోఫీ యా ఖురేషిపై కొంతమంది బిజెపి మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరికాదు. బిజెపి రాజ్యసభ సభ్యులు రామచంద్ర జంగర మాట్లాడుతూ పహల్గాములో మహిళలు ఉగ్రవాదులను ఎదుర్కొనే దాంట్లో పోరాట స్ఫూర్తి లేదు, అందువల్లనే తమ భర్తలను కోల్పోవాల్సి వచ్చిందని మాట్లాడడం బిజెపి యొక్క సంస్కృతికి అద్దం పడుతుంది.
రెండు రోజుల క్రితం అమెరికా వాణిజ్య కోర్టులో భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ట్రంపు తన సుంకాల అధికారాన్ని వినియోగించి, రెండు దేశాల మధ్య కాల్పులు విరమణకు ఒప్పించారు అని, ఇది అమెరికా అధ్యక్షుడికి ఉన్న సుంకాల అధికారంతోనే సాధ్యమైందని వాణిజ్య కోర్టులో అధికారులు సైతం వివరించారు.
దీనిపైన కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అన్నారు. వీటి పైన కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా ఏ చిన్న అవకాశం దొరికినా హిందూ ముస్లింల మధ్య వైశ్యామ్యాలు సృష్టించే విధంగా మాట్లాడడం దారుణం.
మతోన్మాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, మతసామరస్యం, దేశ సమైక్యత రాజ్యాంగ పరిరక్షణ కోసం మేధావులు, ప్రజలు ముందుకు రావాలని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అన్ని తరగతుల మతాల, కులాల, వర్గాల ప్రజల మద్దతు తీసుకోవాలని, మతపరమైన విభజనలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు.
కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సిపిఎం పార్టీ నాయకులు కే. పెంచల నరసయ్య, ఎండి అబ్దుల్ అజీజ్, కట్టా సతీష్, ఒంగోలు సుధీర్ ఎస్ కే షాహినా బేగం, అరిగెల రమమ్మ, ఎస్కే శంషాద్, సుధాకర్, మాల కొండయ్య, ఎస్కే ఖలీల్, ఎస్డి రఫీ నజీర్, సంపత్ కుమార్, ఆర్ వి రావు ఎస్ బాబు పి శ్రీనివాసులు కోటేశ్వరరావు ఈశ్వరయ్య డి రాజా రత్నం శ్రీనివాసులు రమణయ్య సర్తాజ్, కృష్ణమూర్తి, పెంచలయ్య, సురేష్, కుమార్ సుజాతమ్మ, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.