*మచ్చలేని మానవతామూర్తి నాన్నగారిని గెలిపించండి — ఆదాల హిమబిందు*

*రూరల్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి ఇవ్వండి — ఆదాల హిమబిందు*

*అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆస్వరించండి — ఆదాల హిమబిందు*

*నాలుగేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలో చేసి చూపించిన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి — ఆదాల హిమబిందు*

*37వ డివిజన్లో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిగార్లకు మద్దత్తుగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదాల హిమబిందు*

*ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఆదాల హిమబిందుకు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు*

*25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని మానవతామూర్తి నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఆదాల హిమబిందు ప్రజలను కోరారు.* రూరల్ గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం నాన్నగారు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ఒక్క సంవత్సర కాలంలో ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆదాల హిమబిందు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆమె 37వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్లకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదాల హిమబిందు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నిరంతరం ప్రజాసవకే అంకితమై అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించే మా కుటుంబానికి నెల్లూరు రూరల్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రస్తుతం ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా అందుతున్న సంక్షేమ పథకాల ప్రయోజనం కొనసాగాలంటే అందరూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి గార్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఆదాల హిమబిందు కోరారు. *నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశా నిర్దేశంలో* ఆదాల హిమబిందు చేపడుతున్న ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక 37వ వైస్సార్సీపీ డివిజన్ నాయకులు అనిల్ ఆనంద్ వెంకటేశ్వర్లు గోపి ప్రసాద్ రెడ్డి తదితరులతోపాటు యువ నాయకులు కొండ్రెడ్డి భరత్ కుమార్, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నగర పార్టీ ఉపాధ్యక్షుడు వేలూరు శ్రీధర్ రెడ్డి, ఏపీ స్టేట్ ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ తాటిపర్తి వెంకటేశ్వర్లు, టిఎల్ఎఫ్ అధ్యక్షులు హరిత రెడ్డి భార్గవి రెడ్డి, రోజా రాణి, పాశం వెంకటేష్, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed