*మంత్రి నారాయణ మెప్పు పొందేందుకే తిరుమల నాయుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై.. అర్థరహిత ఆరోపణలు చేస్తున్నాడు : వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి.*
————————————–
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లోని రాంజీ నగర్ వైసిపి నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు *మజ్జిగ జయ కృష్ణారెడ్డి* మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
👉 టిడిపి నేత తిరుమల నాయుడు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అమర్యాదగా, స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
👉 చంద్రశేఖర్ రెడ్డి గారి వద్ద విద్యార్థిగా, విద్యార్థి విభాగం నేతగా మెలిగిన తిరుమల నాయుడుకి చంద్రశేఖర్ రెడ్డి మనస్తత్వం గురించి తెలియదా
👉 పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా లాంటి కష్ట సమయంలో.. ప్రజలకు అందుబాటులో ఉండి రెడ్ క్రాస్ ద్వారా ఎన్నో సేవలందించారని తెలిపారు.
👉 కరోనా సమయంలో మంత్రి నారాయణ ప్రజల్లో కూడా కనిపించకుండా… పారిపోయారని ఎద్దేవా చేశారు.
👉 ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారిని తిరుమల నాయుడు నువ్వు అని ఏకవచనం తో సంబోధించడం..తోపాటు..
నారాయణ office వాళ్ళు వ్రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి మాట్లాడటం సరికాదన్నారు.
👉 అన్నీ తెలిసిన తిరుమలనాయుడు ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసమే.. చంద్రశేఖర్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
👉 సైకిల్ మీద తిరిగే తిరుమల నాయుడు.. ఈరోజు ఇన్నోవా కారు లో తిరిగే స్థాయికి ఎలా వచ్చారు మాకు తెలుసునన్నారు.
👉 గతంలో ఇసుక విధానంపై పోరాటం చేసిన తిరుమల నాయుడు .. భవన నిర్మాణ కార్మికులను మభ్యపెట్టి.. వారి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారో అందరికీ తెలుసన్నారు.
👉 ఆ విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలు మిమ్మల్ని దూరం పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
👉 మొన్నటి వరకు ఇసుకను తిరుమల నాయుడు 35 వేల రూపాయలకు అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
👉 ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తిరుమల నాయుడు మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.