మంత్రి నారాయణ దత్తత డివిజన్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
అన్నదాన కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
ఎన్టీఆర్ సేవలను కొనియాడిన వేమిరెడ్డి
———————–నెల్లూరు సిటీ
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, 9 నెలలోనే అధికారాన్ని చేపట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని టిడిపి సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు
శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దత్తత తీసుకున్న 13వ డివిజన్ యలమవారిదిన్నె లో జరిగిన అన్నదాన కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నేడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా నెల్లూరు నగరంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు
నగరంలోని పలు డివిజన్లలో ఎన్టీఆర్ సేవలకు గుర్తుగా
పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలు నూతన సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఆయన సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు
*సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేద ప్రజల మనిషిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు*
కిలో బియ్యం రెండు రూపాయలకే అందించిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వృద్ధులకు పింఛన్లు, యువత ఉద్యోగాలు, మహిళలకు రిజర్వేషన్లు అందించడమే కాకుండా రైతులకు తక్కువ వడ్డీకే సబ్సిడీ రుణాలు, ఎరువులు అందించారన్నారు.
ఆ మహనీయుని సేవలు గుర్తు చేసుకుంటూ నేడు నెల్లూరు నగరంలోని మంత్రి నారాయణ దత్తత తీసుకున్న 13వ డివిజన్లో పేదలకుఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని స్థానిక పార్టీ నాయకులను కొనియాడారు.
చంద్రబాబు ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సేవలందిస్తూ మంచి ప్రభుత్వంగా నిలుస్తుంది అన్నారు
ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు