*మంచి బాలుడిలా రోజూ స్కూలుకి(అసెంబ్లీ) రా*
*జగన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు*
అసెంబ్లీలో జగన్ రెడ్డి లేకపోతే సందడే లేదు
అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టనని మొదట చెప్పాడు..ఈ రోజు వచ్చాడు..ఇదంతా పిరికిపంద వ్యవహారం
పులివెందుల పులి మాట మీద నిలబడతాడని మొదల బడాయిలకు పోయారు
ఇప్పుడేమో 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని భయపడ్డాడు
ఉప ఎన్నిక వస్తే పులివెందులతో పాటు మొన్న వచ్చిన 11 సీట్లూ పోగొట్టుకుంటామని భయమొచ్చింది
ఒక్క రోజు సంతకం చేసి మళ్లీ 60 రోజులు ఎగ్గొట్టొద్దు..మంచి బాలుడిలా రోజూ స్కూలుకి రా
18 సీట్లు వచ్చివుంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వచ్చేది. ఇప్పుడు జగన్ రెడ్డి కేవలం వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత సమయం ఇస్తే, తనకు అంతే కావాలని పంతం పడతాడు
చట్టాలకు అతీతంగా దురాశ పనికిరాదు