ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం – నెల్లూరులో బిజెపి నాయకుల హర్షం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి గట్టి బుద్ధి చెప్పారని, మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. కేజ్రీవాల్ పాలనలో విఫలమైన పలు సమస్యలు, ముఖ్యంగా పొల్యూషన్ సమస్య, ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని పేర్కొన్నారు.
రాష్ట్ర సెల్స్ ఇన్‌చార్జ్ పి. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు అవినీతికి గట్టి సమాధానం ఇచ్చి, అభివృద్ధిని పట్టం పట్టే దిశగా బీజేపీకి భారీ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ అభివృద్ధి ఉంటదో, అక్కడ ప్రజలు మద్దతిస్తారని చెప్పినట్లుగానే ఎన్డీఏ పాలనలోకి ఢిల్లీ చేరిందని తెలిపారు.భారతదేశ రాజధాని ఢిల్లీ, మోడీ నేతృత్వంలో మరింత అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే ఓ ప్రగతిశీల రాజధానిగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెలుగు ప్రజలు కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపి, బీజేపీ విజయానికి సహకరించారని తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్డీఏ బలం పెరుగుతోందని, దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో బీజేపీ విజయపరంపర కొనసాగుతోందని తెలిపారు. అవినీతి పాలనకు, కుటుంబ రాజకీయాలకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం దేశ ప్రజల స్ఫూర్తిదాయక నిర్ణయం అని అభిప్రాయపడ్డారు.”కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఖండించారు. దేశవ్యాప్తంగా మోడీ 3.0 గెలుపు ఖాయం. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ విజయతీరాలకు చేరుకుంటోంది” అని పి. సురేందర్ రెడ్డి అన్నారు.
కందికట్ల రాజేశ్వరి మాట్లాడుతూ ఆప్ ప్రభుత్వాన్ని ఆఫ్ చేసి ప్రతి మహిళా కూడా ఈరోజు ఢిల్లీలో ఆనందోత్సవాలతో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆమె అన్నారు
జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సహా పలు సమస్యలకు బీజేపీ అధికారం చేపట్టి పరిష్కారం చూపుతుందని , ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు ఎన్సీ పెంచలయ్య, జిల్లా కార్యదర్శులు పరుశురాం చిలకా ప్రవీణ్ కుమార్, సుధాకర్ రెడ్డి, కుప్పా ప్రసన్న,మండల అధ్యక్షులు మింగ కిరణ్ మదన్, సుధీర్ ,గుంజి శ్రీనివాసులు, ఓబీసీ మోర్చ జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, హర్షవర్ధన్ రాములు గంటా విజయశ్రీ సత్యనారాయణ లెక్కల రాజశేఖర్ రెడ్డి ,ముని సురేష్ ,చిలకపాడు శ్రీనివాసులు, సుబ్బారావు, కిరణ్ , నారాయణా,అవినాష్ నాయుడు, రాధాకృష్ణారెడ్డి, ప్రదీప్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు