
*భవనాల తొలగింపు ప్రక్రియను శుక్రవారం పర్యవేక్షించిన నగర కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల తొలగింపు ప్రక్రియ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది.
భవనాల తొలగింపు ప్రక్రియను కమిషనర్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు, డ్రైను కాలువలు రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఏ.సీ.పీలు, టి.పి.బి.వో లు, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.