భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న కాగడాల ప్రదర్శన జయప్రదం చేయండి – డివైఎఫ్ఐ
దేశ స్వాతంత్య్రం పోరాటంలో కేవలం 23ఏళ్లకే ఉరి కంభాన్ని ముద్దాడి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని మార్చి 23న పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సుందరయ్య బొమ్మ నుంచి గాంధీ బొమ్మ వరకు జరుగుతున్న కాగడాల ప్రదర్శన జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా నగర కార్యదర్శులు ఎంవి రమణ, బీపీ నరసింహలు మాట్లాడుతూ…
దేశ స్వాతంత్రం కోసం చిన్న వయస్సులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజు 94వ వర్ధంతిని పురస్కరించుకొని నగర వ్యాప్తంగా సేవా, శ్రమదాన, రక్తదాన శిబిరాలు, కాగడాల ర్యాలీలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు,మెడికల్ క్యాంపులు వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని ఈ కార్యక్రమాలలో యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అభివృద్ధి కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉందని, కోట్లాది ప్రజలకు కోనుగోలు శక్తి కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద, మతోన్మాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని తెలిపారు. దేశంలో లౌకికవాదం, సామ్యవాదం కోసం చివరి దాకా భగత్ సింగ్ నిలబడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ, గ్రుప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. నగరంలో ఉద్యోగ ఉపాధి లేక యువకులు మొత్తం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారని వీళ్ళందరూ ఎలా బతకాలో తెలియక మత్తుకు బానిసవుతున్నారని తెలిపారు.నగరంలో రౌడీయిజం పెరిగిపోయినదని నగరంలో వారానికి ఒక హత్య జరుగుతుందని హత్య చేసేవాళ్ళు హత్యకు గురి అయ్యే వాళ్లు అందరూ కూడా యువకులే అనే తెలిపారు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కు,గంజాయి, మధ్యంకు బానిసలై మత్తులో ఇలాంటి అగాత్యాలు చేస్తున్నారని తెలిపారు ఇలాంటి వారి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర నాయకులు తిరుపతి జగదీష్, సాయి గణేష్, శీను, నంద కిరణ్, శ్రీ హరి,జీవన్, విక్రమ్ పాల్గొన్నారు.