*బెదిరించేవాళ్ళు కావాలో… మంచిచేసేవాళ్ళు కావాలో… ప్రజలు ఆలోచించండి — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*ఎన్నికల స్టంట్ బాబు మాయమాటలు నమ్మవద్దు — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*పేదలకు వరం సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలి — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*మంచి వారికి ఓటు వేస్తే అంతా మంచే జరుగుతుంది — వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*
*పల్లిపాలెం, వడ్డిపాలెం, మాదరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం*
*ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామీణ ప్రజలు*
*వడ్డిపాలెంలో వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు*
ఎన్నికలకు ముందు సాధ్యంకాని బూటకపు హామీలను కోకొల్లులుగా ప్రజలకు ఇచ్చే *ఎన్నికల స్టంట్ బాబు మాయమాటలు ప్రజలు నమ్మవద్దని* నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. పేద ప్రజల విద్య వైద్యం ఆరోగ్య అంశాలకు సంబంధించి గట్టి భరోసా ఇచ్చి అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు సమర్ధించి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రశాంతతకు మారుపేరైన గ్రామాలలో శాంతియుత పరిపాలన అందించే మంచి వ్యక్తులు కావాలో… ప్రజలను బెదిరించే అరాచక శక్తులు కావాలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. పేద ప్రజలకు వరం లాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. మంచి వాళ్లకు ఓటు వేస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని మన ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి రానున్న ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. *ఎన్నికల ప్రచారం సందర్భంగా మాదిరాజు గూడూరు పంచాయతీలోని వడ్డీపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి 30 కుటుంబాల వారు బెల్లంకొండ నాగభూషణం ఆధ్వర్యంలో ఉప్పు రామయ్య ఉప్పు లక్ష్మయ్య నెల్లూరు శ్రీధర్ నెల్లూరు వెంకటరామయ్య ఒలిపి పెంచలయ్య గుంజి కోటేశ్వరరావు నెల్లూరు అంజి కుమార్ తదితరులతోపాటు వారి బంధుమిత్రులు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అభివృద్ధిని ఆకాంక్షించి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారందరిని వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు*. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైసిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మాదిరాజు గూడూరు పంచాయతీ మజారా గ్రామాలైన పల్లిపాలెం, వడ్డీపాలెం, వడ్డీపాలెం గిరిజన సంఘం, మాదిరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాల ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపుపై నుండి పల్లిపాలెం, వడ్డీపాలెం, వడ్డీపాలెం గిరిజన సంఘం, మాదిరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల రోడ్ షో నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి ఆయా గ్రామాల ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రెటరీ వై వి రామిరెడ్డి, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ యాదవ్, రాష్ట్ర సేవ దళ్ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి శ్రీ చరిబాబు యాదవ్,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి లంక రామ శివారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గునపాటి రమేష్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య, బద్దిపూడి రవీంద్ర ఆయా గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.