*”బీసీ లకు నామినేటెడ్ పదవులలో 34 శాతం కేటాయిస్తూ తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్య శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన రాష్ట్ర మంత్రులకు కృతఙ్ఞతలు : రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్*
*బీసీ లకు మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కగా, స్థానిక సంస్థల్లో బీసీ లకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారిది.*
*తాత ఆశయాలు, తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న నారా లోకేష్ బాబు యువగళం లో ఇచ్చిన “బీసీ లకు 34 శాతం నామినేటెడ్ పదవులు” హామీ నెరవేర్చి బీసీ ల జీవితాల్లో సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించారు.*
*”బీసీ లకు 34 శాతం నామినేటెడ్ పదవుల” తీర్మానం తో తెలుగుదేశం పార్టీ బీసీ ల పార్టీ అన్న విషయం మరోమారు రుజువైంది.*
*- బీద రవిచంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ను 34 శాతం నుండి 24 శాతానికి కుదించి 16860 మంది బీసీ లను రాజ్యాంగ బద్ద పదవులకు దూరం చేసిన పాపం వైసీపీ ది.
139 కులాలకు 56 కార్పొరేషన్ లను హడావుడి గా ఏర్పాటు చేసి బీసీ ల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధి కేటాయించకుండా బీసీ లను దగా చేసిన ఘనత వైసీపీ ది.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టిన బీసీ భవన్ లను వైసీపీ అధికారం లోకి వచ్చాక కక్ష పూరితంగా అడ్డుకున్నారు. 5 ఏళ్ల పాలన లో బీసీ భవన్ ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయారు.
బీసీ లను ఓటు బ్యాంకు లా చూడకుండా, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గౌరవ ప్రదమైన స్థానాల్లో చూడాలనే మంచి ఉద్దేశం తో నారా లోకేష్ బాబు “బీసీ లకు 34 శాతం నామినేటెడ్ పదవుల” హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ని నెరవేర్చుతూ బీసీ లకు 34 శాతం నామినేటెడ్ పదవుల తీర్మానం చేయించడం నారా లోకేష్ నాయకత్వ పటిమ కు నిదర్శనం.