*బీసీల ద్రోహి జగన్ రెడ్డి*
*ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఎవరూ మద్దతు ఇవ్వొద్దు*
*కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి బీసీల శత్రువుకు అస్సలు ఓటు వేయొద్దు*
*ప్రతి ఒక్కరూ టీడీపీ మిత్రపక్షాలకు అండగా నిలవండి*
*బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఒట్టూరు సంపత్ యాదవ్*
బీసీ సంఘాలన్నీ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాయి
సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్ లో ప్రతి ఒక్కరూ టీడీపీ కూటమికి ఓట్లు వేయండి
జిల్లాలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా టీడీపీతో పాటు మిత్రపక్షాలకు అండగా నిలవండి
బీసీల పాలిట శాపంగా మారిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓటు వేయద్దు
కులాల పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సఖ్యతగా ఉన్న వారి మధ్య బేధాలు సృష్టించారు
రాజకీయ నిరుద్యోగం లేకుండా చేసుకునేందుకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా అలంకార ప్రాయమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం అమలులో ఉన్న పథకాలను మొత్తం ఎత్తేసి తీరని ద్రోహం చేసిన చరిత్ర జగన్ రెడ్డిది
బడుగు బలహీన వర్గాల ప్రజలు నాశనమై, తమ సొంత సామాజిక వర్గమొక్కటే బాగుండటమే జగన్ రెడ్డి లక్ష్యం
బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం
వైసీపీ ఐదేళ్ల పాలనలో 1200 మంది బీసీలు హత్యకు గురయ్యారు. బీసీల పాలిట శాపంగా మారిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందే
కూలి చేసుకుని బతికే పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూడా దుర్మార్గంగా మూసేశాడు
తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు, నాలుగు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి పేదలపై మోయలేని భారం మోపాడు
నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచి సామాన్యుల బతుకుపై కొట్టాడు
ఏం మంచి చేశాడని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలి
ఐదేళ్ల పాలనలో రోడ్లపై ఒక తట్ట మట్టిపోసిన పాపాన పోలేదు..పేదల కోసం ఒక్క సిమెంట్ బస్తా వినియోగించలేదు
బటన్ నొక్కి ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరులుగా మార్చానని జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడు. కానీ ఈ చేత్తో రూ.10 చేతి మరో చేతితో రూ.100 లాగేసుకున్నాడు
లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఒక్కరి నెత్తిపై లక్షలాది రూపాయల అప్పుపెట్టి పారిపోయేందుకు సిద్ధమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
మాటకొస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా
సొంత బాబాయి చంపినోడిని జైలుకు పంపే దిక్కులేదు కానీ. గులకరాయితో కొట్టినోడిని గంటలో పట్టుకున్నారంట
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కక్షపూరిత వాతావరణాన్ని పెంచి పోషించాడు.
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కక్షసాధింపులు, అక్రమ అరెస్టులను ప్రోత్సహించాడు
ఈ రోజు దాదాపు 90 శాతం మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు
సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలిపితే కేసులు, వాస్తవాలను రాసే జర్నలిస్టులకు జైళ్లు..జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులకు రాష్ట్రంలో ఎవరికీ మినహాయింపు లేకుండా పోయింది
మద్య నిషేదం హామీతో అధికారంలోకి వచ్చి జే బ్రాండ్స్ తో వ్యాపారం చేస్తున్నాడు. నకిలీ మద్యంను అమాయకులకు అధికరేట్లకు అమ్మి వారిని ఆస్పత్రుల పాల్జేస్తున్నాడు
ఏ ఆస్పత్రిలో చూసినా ఆరోగ్య శ్రీ వర్తించదు అని బోర్డులు పెట్టే పరిస్థితి తెచ్చాడు
అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలులోకి తెస్తున్నాడు. ఇప్పటికే తెల్లకాగితాలపై రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు
నెల్లూరులోని పెన్నా డెల్టాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రాఫ్ హాలిడే ప్రకటించే పరిస్థితి తెచ్చారు
బీసీలంటే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పగ. ఆయుర్వేదం మందు ఆనందయ్య, చెముడుగుంట నాగేంద్ర, నిడిగుంటపాళెం శీనయ్య తదితర ఎందరో బీసీ నాయకులు కాకాణి బాధితులే
ఆయన నోరు తెరిస్తే బూతులే. ప్రత్యర్థులనే కాదు. వారి తల్లిదండ్రులను వదిలిపెట్టకపోవడం కాకాణి నైజం
2019 ఎన్నికల్లో సోమిరెడ్డికి అండగా నిలిచిన తోడేరుకు చెందిన బీసీలపై అక్రమ కేసులు బనాయించి వెంటపడి వేధించాడు
అలాంటి ద్రోహులకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. సమాజానికి చీడపురుగులుగా భావించి రాజకీయాల నుంచి వెలివేసేలా తీర్పు ఇవ్వాలి
గెలిచినా, ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పోరాడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఈ ఒక్కసారి ఆశీర్వదించాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నా
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ లో అందరూ అండగా నిలిచి గెలపించాలి
నెల్లూరు సిటీలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన పొంగూరు నారాయణపై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా గెలిచే ప్రసక్తే లేదు. ప్రజలే నారాయణ నాయకత్వాన్ని కోరుకుంటుండటం శుభపరిణామం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రజాసేవకు అంకితమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందరూ ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను.