*బీసీలపై వేధింపులే కాకాణికి శాపాలయ్యాయి*
*మంత్రిగా ఏ రోజూ గోవర్ధన్ రెడ్డిని కోవూరుకు ఆహ్వానించని ప్రసన్నకు అమాంతంగా ఆయనపై ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది*
*సొంత మేనత్తను అవమానించేలా కాకాణి మాట్లాడిన రోజు ప్రసన్న ఏం చేస్తున్నాడో*
*నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర*
మా నాయకుడు సోమిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు శోచనీయం
సోమిరెడ్డి ఎన్నికల్లో ఓడినా ఏ రోజూ ఇంటికి పరిమితం కాలేదు..గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేశారు
వైసీపీ ఆరాచక పాలనపై వీరోచిత పోరాటం చేసిన నాయకుడు సోమిరెడ్డి
గతంలో సోమిరెడ్డి కుటుంబంపై కాకాణి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు..తన మేనత్త(సోమిరెడ్డి తల్లి)ను కూడా కించపరిచేలా మాట్లాడిన రోజు ప్రసన్నకుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో
అక్రమాలకు పాల్పడబట్టే ఈ రోజే కాకాణి జైలుకు ఉన్నాడు..కోర్టులను ఎవరూ ప్రభావితం చేయలేరు..నేరస్తుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
వైసీపీ పాలనలో కాకాణి గోవర్ధన్ రెడ్డి బీసీలపై కక్షకట్టి వేధింపులకు పాల్పడ్డాడు
కోడూరులో గంగాధర్ రొయ్యల గుంతలను ధ్వంసం చేయించి రూ.1.50 కోట్ల విలువైన రొయ్యలను సముద్రం పాల్జేశాడు
వెంకటాచలం మండలంలో కుంకాల నాగేంద్రకు చెందిన సెల్ టవర్లను కూలగొట్టించాడు..లారీ కాటాను ధ్వంసం చేయించాడు
ఎందరో బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపాడు…ఇవన్నీ చేసిన రోజు ప్రసన్నకుమార్ రెడ్డి తప్పని వారించకూడదా
బీసీలపై సాధించిన వేధింపులే ఈ రోజు కాకాణికి శాపంగా చుట్టుముట్టాయి
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఈ రోజు ప్రసన్న ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాడు..కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజైనా కోవూరుకు ఆహ్వానించాడా
ఇప్పటికైనా సోమిరెడ్డి కుటుంబంపై పడి ఏడ్వడం ఆపాలని హితవు పలుకుతున్నాం