*బీజేవైఎం రాష్ట్ర నేతలు నరేష్  మరియు ఆశోక్ లకు గణ సన్మానం*

బీజేవైఎం రాష్ట్ర నేతలకు ఘన సన్మానం భారతీయ జనతా పార్టీ యువజన విభాగం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుత్తా. అశోక్ నాయుడు రాష్ట్ర సహాయ కోశాధికారి మురగ. నరేష్ లకు బిజెపి రాష్ట్ర నేతలు శాలువాలు, పుష్పగుచ్చాలు, స్వీట్స్ అందించి గణంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా నరేష్ అశోక్ నాయుడు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర పార్టీ పదవులను అప్పజెప్పడం జరిగిందని తాము పార్టీ సిద్ధాంతాలకు నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధికి తమ సాయిశక్తుల కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజా సంక్షేమ పథకాలను చిట్టచివరి లబ్ధిదారునికి చేరేవరకు పని చేస్తామన్నారు.

అలాగే సమాజంలో పెచ్చు మీరు పోతున్న ర్యాగింగ్, డ్రగ్స్, డ్రింక్, డాన్స్ తదితర త్రీడీ కల్చర్ను అలవాట్లను వ్యతిరేకంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని విద్యార్థి యువతను చెడు నడతకు పోకుండా కాపాడుకుంటామని రాష్ట్రంలో మత్తు పదార్థాలు గంజాయి మద్యం, గుట్కా ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని జాతీయ భావాలు నైతిక విలువలు దేశభక్తి తదితరాలను వారికి అలవాటు చేస్తామని క్రీడా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల పట్ల యువతను చైతన్యం తెచ్చి విశేషంగా ఆకర్షిస్తామని ఆ రకంగా వారికి శిక్షణ ఇస్తామని తెలియజేశారు. అలాగే తమని ఇంత పెద్ద ఎత్తున సన్మానించిన పెద్దలందరికీ పేరుపేరునా పాదాభివందనాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల. రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి. భారత్ కుమార్ యాదవ్, నమామే గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల. రమేష్, బిజెపి లీగల్ సెల్ నాయకులు రంగరాజన్, పేటేటి. భాస్కర్, న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు నాగేంద్ర సింగ్, ప్రస్తుత మండల అధ్యక్షురాలు పద్మావతి, మండల కార్యదర్శి చిట్టిబాబు, కుమార్, మాజీ జిల్లా కార్యదర్శి చిలక. ప్రవీణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరు. నవీన్, మండల బిజెపి ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ, సుబ్బారావు, మండల మహిళా కార్యదర్శి మనోశ్రావ్య, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి నాగలక్ష్మి, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed