*బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ*
నెల్లూరు నగరం, రామ్మూర్తి నగర్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం నాయకులు మరియు కార్యకర్తలు స్వీట్స్ తినిపించుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ – 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించిన బీజేపీ కేవలం రెండు సీట్లతో ప్రారంభమైనప్పటికీ, నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఎదగడం కార్యకర్తల నిబద్ధతకు నిదర్శనమన్నారు.
“నేషన్ ఫస్ట్ – పార్టీ నెక్స్ట్ – సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో బీజేపీ పయనిస్తోందని, అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ 16 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించగలగడంలో కోట్లాది మంది కార్యకర్తల శ్రమ వుంది అని తెలిపారు.
పార్టీ కోసం జీవితాలను అర్పించిన నాయకులను, కార్యకర్తలను స్మరించుకుంటూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య కుటుంబాల నుండి వచ్చిన నాయకులే బీజేపీకి బలమవుతారని, వంశపారంపర్యాన్ని ఆధారంగా చేసుకున్న కుటుంబ పార్టీలకు ప్రజలు నెమ్మదిగా గుడ్‌బై చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని, 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూనే, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కార్యకర్తలు మరింత చొరవ చూపాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి,ఓబీసీ జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎకసిరి ఫణి రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గిరికుమార్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షులు కరణం సుభాషిని, కార్యాలయ కార్యదర్శి కుప్పా ప్రసన్న, వెంకటేశ్వర్లు, రాములు, కోసూరు బాలయ్య గౌడ్, మండల అధ్యక్షులు వెంకటేష్, మదన్, మళ్లీ రవి, తన్నీరు సుబ్బారావు, మారం కృష్ణ , ఇతర జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.