*బీజేపీలో భారీగా చేరికలు – వెంకటేశ్వరపురం 54వ డివిజన్ నుండి షేక్ పీర్ సాహెబ్ ఆధ్వర్యంలో 30 మందికి చేరిక*

నెల్లూరు, ఏప్రిల్ 25:
వెంకటేశ్వరపురం 54వ డివిజన్ నుంచి ప్రముఖ నాయకుడు షేక్ పీర్ సాహెబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు జరిగాయి. ఆయన నాయకత్వంలో సుమారు 30 మంది యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం పొందారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు హాజరై కొత్తగా పార్టీలో చేరిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా షేక్ పీర్ సాహెబ్ గారు మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నన్ను ప్రభావితం చేశాయి. దేశాభివృద్ధి దిశగా జరుగుతున్న బీజేపీ ప్రయాణంలో భాగస్వాములమవడం సంతోషంగా ఉంది,” అని అన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు డి. వెంకటేష్, శివకుమార్, రంగపట్నం శ్రీనివాసులు, పో. కురు మాధవ్, అశోక్ కుమార్, చచ్చాల ప్రసాద్, జీ. నరసింహులు నాయుడు, దాసరి శరవణ తదితర మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *