*బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ అరెస్ట్*
*పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ అరెస్ట్ అయ్యారు.* శుక్రవారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో కల్యాణ్‌తో పాటు పశుసంవర్ధక శాఖ మాజీ సీఈవో రాంచందర్‌ను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్‌లో రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన ఏసీబీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
తాజాగా మాజీ మంత్రి ఓఎస్డీని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా సెలైంట్‌గా ఉన్న ఏసీబీ.. లోక్ సభ ఎలక్షన్స్ ముగియడంతో ఈ కేసులో దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ మరోసారి జోరు పెంచడంతో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.