బిజెపి సీనియర్ నాయకుడు అన్నం శ్రీనివాసులు కన్నుమూత

తోటపల్లి గూడూరు మండలం,నరుకూరు గ్రామంలో శోకసంద్రం

తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు అన్నం శ్రీనివాసులు ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్థానికంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీగా తరలి వచ్చి నివాళులర్పించారు.మృతుడు అన్నం శ్రీనివాసులు పార్టీ పట్ల కట్టుబాటుతో, సేవాభావంతో పనిచేసిన నాయకుడిగా బిజెపి శ్రేణుల్లో గౌరవాన్ని సంపాదించారు. ఆయన ప్రాంతీయ ప్రజల అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి స్వయంగా నరుకూరు గ్రామానికి వెళ్లి మరణించిన శ్రీనివాసుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, “శ్రీనివాసులు గారు పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయాలు. మీరు ధైర్యంగా ఉండండి, మేమంతా మీతోనే ఉన్నాం” అని అన్నారు.పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.స్థానిక ప్రజలు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చివరి నివాళులు అర్పించారు. గ్రామం మొత్తంలో విషాదఛాయ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *