బాలికకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్లదిబ్బలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచమ్మ అనే బాలికకు వేమిరెడ్డి దంపతులు అండగా నిలిచారు.
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు బాలిక పరిస్థితిని తెలుసుకున్న వెంటనే.. స్థానిక నాయకులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో టిడిపి నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పవన్ రెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ ఇంతియాజ్ తదితరులు బాలికను ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారు.
కుడితిపాలెం కాకర్లదిబ్బలో బాలికపై బంధువులు దారుణంగా దాడి చేసి వాతలు పెట్టగా.. ఈ ఘటనను ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తీవ్రంగా పరిగణించారు. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే బాలిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాలికకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆమె వెల్లడించారు.