*బాలల భవిష్యత్తుకు భరోసా – జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ చేతుల మీదుగా స్టేషనరీ పంపిణీ*

బాలల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు
మరోసారి తన సామాజిక సేవా మనసును చాటుకున్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నెల్లూరు వనంతోపు సెంటర్ నగరపాలక పాఠశాలలోదాదాపు 150మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్లు, రబ్బర్లు, స్కేళ్లు, చాక్లెట్లు తదితర స్టేషనరీని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన, “చదువు పేదరికాన్ని జయించే ఆయుధం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో విద్యార్థులకు సేవ చేయడం నా భాగ్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపి, బాలల దినోత్సవ ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేసింది.. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కృష్ణారెడ్డి మార్కెట్ సురేష్,పవన్ యాదవ్, పేనేటి శ్రీకాంత్, వర్షాచలం రాజేష్, దివాణం సురేష్ బాబు,చంటి,
వీర మహిళలు శాంతికల, లత, వాణి, ప్రమీల,
వెంకట సుబ్బమ్మ మరియు ఆఫీస్ ఇంచార్జి జమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed