బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా వినూత్న ఆలోచన
– కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించాలని ప్రచారం చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తున్న ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు.
స్థానిక 48వ డివిజన్ విరాట్ నగర్, వి.బి.ఎస్. కళ్యాణ మండపం సమీపం లో,54 వ డివిజన్ వెంకటేశ్వరపురం,అలాగే కరెంటు ఆఫీసు సెంటర్ వివిధ ప్రాంతాలలో బహిరంగ ప్రదేశంలో వ్యర్ధాలు వేయవద్దని, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నప్పటికీ, స్థానికులు పెడచెవిన పెట్టారని తెలిపారు. స్థానిక ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని నిర్ణయించి, వ్యర్ధాలు వేస్తున్న ఆ ప్రదేశాన్ని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుక్రవారం నాడు నీళ్లతో శుభ్రం చేసి, రంగు రంగుల ముగ్గులతో, పూలకుండీలు అమర్చి సుందరంగా తీర్చిదిద్దారు. దానితో ఆ ప్రాంతంలో వ్యర్ధాలు వేయాలన్న ఆలోచన ప్రజల మనసులో నుంచి తొలగిపోయింది అని కమిషనర్ ప్రకటించారు.
నగర ప్రజలంతా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి తోడ్పడాలని కమిషనర్ ఆకాంక్షించారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.