*బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలపై శాసనమండలిలో నిలదీసిన చంద్రశేఖర్ రెడ్డి..*
*దిక్కు తోచని స్థితిలో కూటమి ప్రభుత్వ మంత్రులు*
*బడ్జెట్ లో ఉద్యోగులకు,పేద ప్రజలకు ఎలాంటి భరోసా దక్కలేదని* ..ఏపీ శాసనమండలిలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చేరిగిన ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————
నేడు ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..*
👉 కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో .. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు.
👉 ముఖ్యంగా ఉద్యోగులకు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కూటమి నేతలు హామీలు గుప్పించారని.. అయితే ఈ రోజు బడ్జెట్ లో ఉద్యోగులకు ఎలాంటి నిధుల కేటాయింపులు జరపకుండా వారిని ప్రభుత్వం నిలువునా దగా చేసిందన్నారు.
👉 ఉద్యోగులకు ఇస్తామన్న IR,DA, అమలు చేయడంలో జాప్యం ఎందుకని..PRC అమలు చేసేందుకు.. కమిటీ వేస్తామని చెప్పి ఇప్పటివరకు కమిటీ వేస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉద్యోగులను మోసం చేయడమేనాన్నారు.
👉 కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం.. IR, PRC, అమలుచేసి ఉద్యోగులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.
👉 కూటమి ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపుల్లో 8 కోట్ల రూపాయలను తగ్గించి.. చూపించారని ఇది ఎలా సాధ్యమని.. ఉద్యోగులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
👉 DA, PRC బకాయిలు, PF, APGLI బకాయిలను క్లియర్ చేస్తామని.. ఎక్కడ బడ్జెట్ కేటాయింపుల లెక్కల్లో.. ఉద్యోగులకు ఎక్కడ హామీ దక్కలేదన్నారు.
👉 ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో మార్పులు చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు దిశగా.. చర్యలు చేపట్టాలని కోరారు
👉 అలాగే 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు ఏపీలో 11 వేల మంది ఉద్యోగుల నియామకం జరిగిందని వారందరికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..CPS రద్దు చేసి OPS పెన్షన్స్ స్కీమ్ అమలు చేయాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
👉 90% శాతం ప్రక్రియ పూర్తయిన 7 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను.. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు..
👉 వారిని రెగ్యులరైజ్ చేసినప్పటికీ ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం పడదని.. గత ప్రభుత్వంలో వారి వేతనాలను కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గణనీయంగా పెంచారని తెలిపారు.
👉 ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోని వారిని.. రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
👉 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి.. ఆరు క్వార్టర్స్ బకాయిలు చెల్లించాల్సి ఉందని.. వాటిని తక్షణమే చెల్లించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
👉 ఈరోజు కూటమి ప్రభుత్వ చర్యలు మూలంగా వాలంటీర్లు అందరూ రోడ్డున పడ్డారని.. వారందరికీ నిరుద్యోగ భృతి అందించడం.. లేదా వారికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
👉 ఆడబిడ్డ నిధి ఇస్తామని అటు మహిళలను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
👉 గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. ఆసరా చేయూత పథకాలతో.. మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు.
👉 తక్షణమే కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసి.. మహిళలను ఆదుకోవాలని కోరారు.
👉 2023-24 ఏడాదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేసి కూడా..కేవలం 73 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేస్తే..2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయకుండా 98 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు.అలాగే 2025-26 కు 1 లక్ష 4 వేల కోట్ల రూపాయల అప్పును బడ్జెట్లో చూపడం జరిగిందన్నారు.
👉 ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.