*బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
– జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు*
————-
మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక నీ బైపాస్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారధ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్తని వ్యాఖ్యానించారు. ఇలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం యువతపై ఉందని గుర్తు చేశారు. సమాజంలోని అసమానతులను రూపుమాపేందుకు జ్యోతిరావు పూలే కృషి ఎనలేనిదని అన్నారు. సీఎం చంద్రబాబు, బ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందని చెప్పారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
సుందరామి రెడ్డి, గునుకుల కిషోర్, అనుదీప్ రెడ్డి,మార్కెట్ సురేష్, సుధామాధవ్, వర్షాచలం రాజేష్, దాసరి పోలయ్య, పవన్ యాదవ్,వెంకట్ తాల్లూరి,మహేష్,మనోజ్,శ్రీనివాస్ ముదిరాజ్, నరహరి, పి శ్రీకాంత్,యాసిన్, ప్రసన్న మరియు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.
