*ఫ్యామిలీ కార్డు సేవలను సద్వినియోగం చేసుకోండి – మెడికవర్ హాస్పిటల్ వెల్లడి*

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో తక్కువ ఫీజులతోనే ఖరీదైన పరీక్షలు, వైద్య సేవలు అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన మెడికవర్డ్ ఫ్యామిలీ కార్డు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి తెలియజేశారు. కేవలం 500 రూపాయలకే ఫ్యామిలీ కార్డు పొందవచ్చునని, దాని ద్వారా కుటుంబం మొత్తం రాయితీతో కూడిన వైద్య పరీక్షలు, వైద్య సేవలు, మందులు పొందవచ్చునన్నారు. గురువారం డాక్టర్ ధీరజ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబ సభ్యులంతా ఓపి కన్సల్టేషన్ పై 25 శాతం, ఓపి పరీక్షలపై 15 శాతం రాయితీ పొందే అవకాశం ఉందన్నారు. అలాగే అడ్మిషన్ పై 10 శాతం, వైద్యేతర సేవలపై 50 శాతం, 10 కిలోమీటర్ల లోపు ఉచిత అంబులెన్స్ సదుపాయం, హోమ్ హెల్త్ కేర్ సేవలపై 30 శాతం రాయితీ లభిస్తుందన్నారు. మందులపై 20 శాతం, హెల్త్ చెకప్స్ పై 10 శాతం, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో మరో రెండు సార్లు ఉచితంగా ఓపి కన్సల్టేషన్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఫ్యామిలీ కార్డును దేశంలోని అన్నీ మెడికవర్ హాస్పిటల్స్ లలో వినియోగించుకోవచ్చునని స్పష్టం చేశారు.

*తగ్గిన అవుట్ పేషెంట్ ( ఓపి ) ఫీజులు -*
మెడికవర్ హాస్పిటల్ లో ఫ్యామిలీ కార్డు సేవలతో సంబంధం లేకుండా అందరికీ వర్తించే విధంగా అవుట్ పేషెంట్ ( ఓపి ) ఫీజులను తగ్గించినట్లు డాక్టర్ ధీరజ్ రెడ్డి తెలియజేశారు. వెయ్యి(1000) రూపాయలు విలువైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల ఓపి ఫీజును కేవలం 500 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అలాగే 750 రూపాయలుగా ఉన్న స్పెషాలిటీ వైద్య సేవల ఓపి ఫీజును 350 రూపాయలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. అతి తక్కువ ఓపి ఫీజుల ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ ధీరజ్ రెడ్డి స్పష్టం చేశారు. తగ్గించిన ఓపి ఫీజులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్ లో పేపర్ లెస్ విధానాన్ని ప్రవేశపెట్టామని, పేపర్ లెస్ విధానంలో భాగంగా ఇకపై ఓపి, వైద్య పరీక్షలు రిపోర్టులు, అడ్మిషన్ వివరాలు అన్నీ ఆన్ లైన్ విధానంలో కొనసాగుతాయన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అధునాతన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. క్యాన్సర్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ ( సర్వైకల్ క్యాన్సర్ ) స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తున్నామని, ఈ అవకాశాన్ని కూడా మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *