ప్లానింగ్ కార్యదర్శులు ఆక్రమణలను గుర్తించండి
– అదనపు కమిషనర్ నందన్
వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులు తమ సచివాలయాల పరిధిలోని ఆక్రమణలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఆదేశించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శులు విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆక్రమణలకు గురైన నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను గుర్తించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం పై లేఔట్ యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తమ పరిధిలోని షాపులకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ టాక్స్ వసూలు చేయాలని, అలాగే వార్డ్ కు పరిధికి సంబంధించి ప్లాన్లు వెంటనే తయారు చెయ్యాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.సి.పి. పద్మజ, ఏ.సీ.పి.వేణు,ప్రకాష్,సర్వేయర్లు,సూపరెంటెండ్ పద్మ, టీ.పీ.బి.వో.లు, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.