ప్రైవేటు ఏజెన్సీల భాగస్వామ్యంతో పార్కుల నిర్వహణ
– అదనపు కమిషనర్ వై.ఓ.నందన్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజా పార్కుల నిర్వహణలో ప్రముఖ వ్యాపార సంస్థలను ప్రైవేటు ఏజెన్సీలుగా భాగస్వామ్యులను చేస్తూ పార్కుల నిర్వహణ చర్యలలో మెరుగైన మార్పులు తేనున్నామని అదనపు కమిషనర్ వై.ఓ.నందన్ తెలియజేశారు.
నగరానికి చెందిన వివిధ ప్రముఖ వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లతో సమీక్ష సమావేశాన్ని కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ వారితో మాట్లాడుతూ ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ప్రతి పార్కులో నూతనంగా వాచ్ మెన్, గార్డెనర్ లను నియమించి పార్కుల నిర్వహణను మరింత ప్రణాళిక బద్ధంగా చేపట్టనున్నామని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని మొత్తం 64 పార్కులకు గాను 36 ప్రజాపార్కుల నిర్వహణలో భాగస్వామ్యం చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలను సిద్ధం చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో ఇతర ఏజెన్సీల నుంచి కూడా అనుకూలమైన స్పందన ఆశిస్తున్నామని అదనపు కమిషనర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈలు శ్రీనివాసరావు, శేషగిరిరావు, డి.ఈ సుధేష్ణ, లలిత జ్యువెలర్స్, చందన బ్రదర్స్, శుభమస్తు షాపింగ్ మాల్, యాక్ట్ సిటీ ఛానల్, జోయ్ అలుకాస్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డి.ఆర్. ఉత్తమ్ హోటల్ తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.