
*”ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా”…! – కాకాణి*
*సీసీ ఫుటేజీల ఆధారంగా నిజానిజాలు తేల్చలే తప్ప, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం : కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:18-09-2025*
*నెల్లూరు నగరం, 16వ డివిజన్ లోని గుర్రాలమడుగు సంగంలో, సంగం మండలం, పెరమన వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి పార్ధీవదేహాలను సందర్శించి, నివాళులర్పించి, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*నెల్లూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న కాకాణి.*
*స్క్రోలింగ్ పాయింట్స్:*
– సంగం మండలం, పెరుమన దగ్గర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం దురదృష్టకర సంఘటన.
– రోడ్డు ప్రమాదాలు సాధారణంగా దురదృష్టకర పరిస్థితిలో సంభవిస్తాయి కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
– ఇసుక అధికలోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూటులో విపరీత వేగంతో కారును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందడం బాధాకరం.
– జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా, అక్రమంగా ఇసుకను అతివేగంతో భారీ వాహనాలతో తోలుతూ ఎంతోమంది ప్రాణాలను తీసుకున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
– పెరుమన దగ్గర ఇసుక అధికలోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
– మరణించిన వారి కుటుంబాల గోడు వర్ణాతీతం.
– ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి సంపాదన కోసం ఎన్ని కుటుంబాలు బలి తీసుకుంటారు!
– నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వల్ల ఇలాంటి ప్రమాదాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.
– అధికార పార్టీ నేతలు ఉచిత ఇసుక పేరుతో అధిక రేట్లతో అనధికారకంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
– అక్రమ ఇసుక దోపిడీయే ధ్యేయంగా కూటమినేతలు పనిచేస్తున్నారు.
– ఇటీవల కాలంలో సోమశిల నుండి నీరు విడుదల చేస్తే విరువూరు ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు నీటిలో చిక్కుకొని మునిగిపోయిన పరిస్థితులు.
– ఎస్పీ గారు స్పందించి అక్రమ ఇసుక, గ్రావెల్ జరుపుతూ, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలి.
– ఎస్పీ గారు రాగద్వేషాలకతీతంగా, పారదర్శకంగా, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.
– పోలీసులు టిప్పర్ తోలిన డ్రైవర్ పైనే కాకుండా, ఈ ప్రమాదానికి కారణంగా భావించే అధిక లోడు ఇసుకను తరలిస్తున్న వ్యక్తులను, వాహన యజమానిపై కూడా కేసు నమోదు చెయ్యాలి.
– సీసీ ఫుటేజీల ఆధారంగా నిజానిజాలు తేల్చలే తప్ప, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం.
– తిరిగి ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా, అక్రమ ఇసుక గ్రావెల్ తరలింపుపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం.
– ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణ సహాయం అందించడంతో పాటు, మరో 25 లక్షలు ప్రమాదానికి కారణమైన వారి నుండి బాధిత కుటుంబాలకు అందించి, ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
– ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు వారి లేని లోటు తట్టుకొని ముందుకు సాగే ధైర్యం అందించాలని భగవంతుని కోరుకుంటున్నాం.