*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి*

*200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది*

*సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే*

*ఉగాది పర్వదినం సందర్భంగా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విశతాధిక జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*డాక్టర్ తిరుమల స్వాతి రచించిన మాడభూషి కవిత్వాసుశీలన గ్రంథాన్ని ఆవిష్కరించిన సోమిరెడ్డి*

*కవులకు ఆత్మీయ సత్కారం చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సోమిరెడ్డి కామెంట్స్*

పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చొరవతో ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మన ప్రాంతంలో ఏర్పాటైంది

ప్రస్తుతం మైసూరులో ఉన్న కన్నడ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయం ప్రతిపత్తి కావాలని మాడభూషి సంపత్ కోరారు. మన కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కచ్చితంగా స్వయం ప్రతిపత్తి సాధించుకుంటాం

ప్రస్తుతం స్వర్ణభారత్ ట్రస్ట్ బిల్డింగ్ లో తాత్కాలిక నడుస్తున్న ఈ కేంద్రానికి జాతీయ రహదారి పక్కనే 5 ఎకరాల భూమి కేటాయింపు జరిగింది

కేంద్రం భవన నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు…ఆ నిధులను సాధించుకుంటాం

ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రానికి రావడం గర్వంగా ఉంది..ఇది మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed