*ప్రశాంతి రెడ్డి గెలిస్తే కోవూరులో అశాంతే..: విజయసాయిరెడ్డి*
…నిజమైన ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి*
*నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి
నెల్లూరు, ఏప్రిల్,25,
గత ఐదేళ్ల కాలంలో ప్రతి పేదవాడి ఇంటికి అండగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని,మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు,ఇందుకూరుపేట గ్రామాలలో పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ బల్లీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులతో కలిసి పాల్గొన్నారు..ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు డబ్బు సంచులతో వచ్చి కోవూరులో దిగిపోయారని అన్నారు..ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అంటున్నారని..
వారు వస్తే
కోవూరులో శాంతిని తీసుకొనిపోయి ఆశాంతిని తీసుకోచ్చే ప్రమాదం వుందని హెచ్చారించారు.ఎన్నికల ముందు వచ్చిన వేమిరెడ్డి దంపతులు ఎన్నికల అయ్యాక మీకు కనిపించరని హెచ్చరించారు..
అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించిన వేమిరెడ్డి ప్రభాకర్ కి కూడా కేసులు ఉన్నాయని అతనేదో నీతిమంతుడులాగా లాగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు..
ప్రశాంతి రెడ్డిని అదరిస్తే ఈ నియోజకవర్గంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు..
కోవూరు నియోజకవర్గంలో నిత్యం ప్రజాసేవలో నిలిచిన నల్లపరెడ్డి కుటుంబానిదే గెలుపని స్పష్టం చేశారు..
ఇప్పటి వరకు మీకు అండగా నిలిచిన ప్రసన్నకూమార్ రెడ్డి భవిష్యత్తులో కూడా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని తెలిపారు..మళ్లీ ప్రసన్నకూమార్ రెడ్డి గెలుస్తాడని ఇక్కడ ప్రజల స్పందన చూస్తేనే అర్ధం అవుతుందని చెప్పారు..
ప్రతిపక్ష నేత
చంద్రబాబు నాయడు
స్టేట్ లేవల్ మాయగాడుని,14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి తన సొంత వర్గానికి తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు..
ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి మంచి పరిపాలన అందిస్తున్నారని, పేద,బడుగు,బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాలలోని పేదదకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలను అందేలా చూస్తున్నారని చెప్పారు
*సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష*
ప్రసన్నకూమార్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు,కార్యక్రమాలను అమలు చేసారని పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి అన్నారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు..
వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామస్థాయి నుండి ఈరోజు పరిపాలన సాగుతోందన్నారు… మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది చాలామంది ముఖ్యమంత్రులుమతో పని చేశామని,జగన్ గారి లాంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చూడలేదన్నారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల, నా వల్ల మీరు లబ్ధి పొంది ఉంటేనే మాకు మరల ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు.. ఎప్పటి నుండో ఈ నియోజకవర్గంలో కష్ట పడిన వారిని కాదని ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఇక్కడ వ్యక్తులకు ప్రతిపక్ష పార్టీ పోటీకి దించిందని మండిపడ్డారు..ఈ వేమిరెడ్డి దంపతులు డబ్బులు పంచడానికి సిద్దంగా ఉన్నారని డబ్బులు తీసుకుని వైఎస్ఆర్ సిపికే ఓటు వేయాలని ఆయన కోరారు..
*పార్టీలో చేరిన వాలంటీర్లు*
కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఈరోజు 20 మంది వాలంటీర్లు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మైపాడు(తూర్పు పట్టాపాలెం) గ్రామం నుంచి టీడీపీకి చెందిన 70 మంది కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికీ పార్టీ నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..