*ప్రశాంతమ్మకు సైకిల్ అందజేసిన వినోద్‌రెడ్డి*
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా శనివారం టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి.. తన అనుచరులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న వినోద్‌రెడ్డి.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన సైకిల్ ను ప్రశాంతమ్మకు అందజేశారు.
ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. శుభాకాంక్షలు తెలియజేసిన వినోద్‌రెడ్డికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ప్రతి ఒక్కరు గొప్ప నాయకులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
కార్యకర్తలకు ఆమె తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఉడాలి సూర్యనారాయణ, చింతారెడ్డి శిరీషారెడ్డి, కుసుమ, కుక్కా ప్రభాకర్, జాన్సీ, కనకేశ్వరరావు, తిరుమల, జాఫర్, వాసు తదితరులు పాల్గొన్నారు.