*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పుట్టికి రూ.19720 పొందండి*
*ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు*
*ధాన్యం విక్రయం విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు*
*జిల్లా రైతులకు పిలుపునిచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు*
*ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి 24 గంటల్లోనే నగదు జమ చేస్తోంది*
*కొనుగోలు ప్రక్రియను కూడా సులభతరం చేశారు*
*దళారుల మాయలో పడకుండా కొంచెం ఓపికగా వ్యవహరించి ఎంఎస్పీకి అమ్ముకోండి*
*కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి*
*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పుట్టికి రూ.19720 పొందండి*
*ధాన్యం విక్రయం విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు*
*జిల్లా రైతులకు పిలుపునిచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*వెంకటాచలం మండలం గొలగమూడిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన సోమిరెడ్డి*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తొలికారు పంట బాగా పండింది
రైతులు ప్రధానంగా కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్, బీపీటీ రకాల పంటలు సాగుచేశారు
ఆర్ఎన్ఆర్ విషయంలో కనీస మద్దతు ధరకు ఇబ్బంది లేనప్పటికీ కేఎన్ఎం కొంత ధర తగ్గినట్లు తెలుస్తోంది
బీపీటీ సాగు చేసిన రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
ప్రతి కొనుగోలు కేంద్రాన్ని దగ్గరలోని రైసుమిల్లుకు ట్యాగ్ చేసేశారు..
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను రైతులు సంప్రదిస్తే ట్యాగ్ చేసిన రైసుమిల్లుకు ధాన్యం తోలేలా చర్యలు తీసుకుంటారు
ఎకరాకు 85 చొప్పున ఖాళీ గోతాలు అందుబాటులో ఉంచాం.
బ్యాంక్ గ్యారెంటీ రేషియోను కలెక్టర్ 1:1 నుంచి, 1:2కి పెంచారు. తద్వారా రైతుల నుంచి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది
బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని రైసుమిల్లర్లపై విషయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతోంది
పొలాల్లో నుంచి ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించాం..ఈ విషయంలో డీటీసీతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నారు
ట్రాక్టర్లతో రైతులు ధాన్యాన్ని తోలుకుంటామంటే అప్పటికప్పుడే జీపీఎస్ అమర్చి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు
ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుని పుట్టికి రూ.19720 చెల్లిస్తుంటే రైతులు రూ.17 వేలుకు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది
ఏ రకం ధాన్యం ఎంత వచ్చినా మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
కొనుగోలు ప్రక్రియ సరళతరం చేశారు…మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం
తేమ శాతం 17 ఉంటే ఒక్క గింజ అదనంగా తీసుకోకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు
ప్రస్తుతం కాస్తున్న ఎండ ప్రభావంతో ఒక్క రోజుకే ధాన్యం బాగా ఆరిపోతోంది
ఆరబెట్టుకోని పక్షంలో నెమ్ము 17పైన ఒక్కో శాతానికి క్వింటాలుకు కిలో మాత్రమే అదనంగా తీసుకుంటారు. అంటే పుట్టికి 8.5 కిలోలు మాత్రమే, 2 శాతం ఉంటే 17 కిలోలు
రైతులు పుట్టికి 900, 950 కిలోలు ఎందుకివ్వాలి
అన్నదాతల్ని దళారులు, రైసుమిల్లర్లతో పాటు అధికారులు ఇబ్బంది పెట్టినా సహించే ప్రసక్తే లేదు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునే విషయంలో రైతులు కొంచెం ఓపికతో వ్యవహరించాలి
ధాన్యం అమ్ముకునే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు