*ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యం*
*15 రోజుల్లో వెంకటాచలం సీ.హెచ్.సీకి సీఎస్ఆర్ నిధులతో పరికరాలు*
*త్వరలోనే పొదలకూరు సీ.హెచ్.సీలో డయాలసిస్ సేవలు*
*ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి*
*వెంకటాచలం సీ.హెచ్.సీ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తున్నాం
ఆస్పత్రి ఆవరణలో అడవిని తలపించేలా ఉన్న చెట్లను తొలగించడంతో పాటు మార్చురీ గదికి సిమెంట్ రోడ్డు వేయించాం
SEIL(సెంబ్ కార్ప్) కంపెనీ సహకారంతో రూ.53 లక్షలతో 15 రోజుల్లో పరికరాలు సమకూర్చబోతున్నాం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం
సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాల కోసం SEIL (సెంబ్ కార్ప్) కంపెనీ రూ.1.90 కోట్లు ఖర్చుపెడుతోంది
ప్రభుత్వ ఆస్పత్రులలోనే కాన్పులు జరిగేలా క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలి
పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో త్వరలోనే మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా డయాలసిస్ సెంటర్ ప్రారంభించబోతున్నాం
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకున్న పాపాన పోలేదు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటు ప్రభుత్వ నిధులతో పాటు అటు ప్రైవేటు కంపెనీల సీఎస్ఆర్ నిధులతో సాధ్యమైనన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం