*SPS నెల్లూరు జిల్లా*

*ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీసు గ్రీవెన్స్ డే సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా యస్.పి. డా.అజిత వేజెండ్ల,IPS.,*

 *సిబ్బంది యొక్క సంక్షేమంలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను తనకు నిర్భయంగా తెలియజేసుకోవచ్చని, సిబ్బంది సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.*
 *జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో “పోలీస్ వెల్ఫేర్ డే” (గ్రీవియన్స్ డే) ను నిర్వహించారు.*
 *జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది వారి యొక్క సమస్యల గురించి(ట్రాన్స్ఫర్స్, రిక్వెస్ట్లు, మెడికల్ సమస్యలు) జిల్లా ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు.*
 *జిల్లా ఎస్పీ గారు వారి సమస్యలను కూలంకుషంగా విని, సాధ్యాసాధ్యాలు పరిశీలించి, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.*
 *ఆయా ఫిర్యాదులపై సంబంధిత జిల్లా పోలీస్ కార్యాలయ(డిపివో) అధికారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు.*

*జిల్లా పోలీస్ కార్యాలయం – SPS నెల్లూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed