
*ప్రతి గిరిజన కాలనీలో ఇప్పటికీ అలాగే అసంపూర్తిగా వున్న వివరములు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చిన బీజేపీ గిరిజన మోర్చ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు*
గౌరవనీయులైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిపాలన శాఖాధికారి వారికి
బీజేపీ గిరిజన మోర్చ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు వ్రాయునది
నెల్లూరు జిల్లాలో నే కాకుండా రాష్ట్రములో 2004 సంవత్సరం నుండి 2019 వరకు ప్రభుత్వం వారు గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యములో గిరిజనులకు నిర్మాణం చేసిన గృహాలకు తలుపులు, కిటికీలు ,పూతపనులు చేయకుండా వదిలి వేసినవి మరియు బేసే మెంట్లు నిర్మాణం చేసి వదిలివేసినవి ప్రతి గిరిజన కాలనీలో ఇప్పటికీ అలాగే అసంపూర్తిగా వున్న వివరములు మేము అనేక పర్యాయములు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినాము,కానీ ఏటువంటి పురోగతి లేదు.
అసంపూర్తిగా వదిలి వేసిన ఇండ్లు వివిధ సంవత్సరముల లో,వివిధ స్కీములలో మంజూరు చేసినందు వలన,పాత స్కీములో నుండి రద్దు చేసి కొత్త స్కీములో చేర్పించి న యెడల అసంపూర్తిగా వదిలి వేసిన ఇండ్లు పూర్తి చేయగలం అని తెలియ జేసినారు.
మీరు విచారణ జరిపించి పాత స్కీము లో మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేయించి కొత్త స్కీ ములో చేర్పించి గిరిజనులకు గూడు వసతి కల్పించి సహాయం చేయవలసినదిగా కోరు తున్నాము ఈ కార్యక్రమములో బీజేపీ గిరిజన మోర్చ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చచ్చళ ప్రసాద్,కార్యదర్శి దాసరి శరవణ తదితరులు పాల్గొన్నారు
పొట్లూరి శ్రీనివాసులు బీజేపీ గిరిజన మోర్చ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నెల్లూరుa