
*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం*
*ప్రజా దర్బార్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
– వినతి పత్రాలు యిచ్చేందుకు బారులు తీరిన ప్రజలు.
– పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలే కోవూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య.
– స్థలం వుండి ఇళ్ళు కట్టుకోవాలంటే సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఇళ్ల స్ధలాలు కావాల్సిన వారు విఆర్ఒ వద్ద పేర్లు నమోదు చేసుకోండి.
– ఇళ్ళు, ఇళ్ల పట్టాల లబ్దిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడితే సహించను.
– తొలి విడతగా ఈ నెల 25 285 మంది లబ్దిదారులకు ఇళ్ళు అందచేయబోతున్నాం.
– నిరు పేదలకు ఇళ్ల కేటాయింపులో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలి.
– అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇళ్ళు మంజూరు చేస్తాం.
– టిడిపి నాయకులు వారం రోజుల పాటు పేదలకు ఇంటి స్థలం, ఇళ్ళు మంజూరు కార్యక్రమం కోసం కేటాయించాలి.
– సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుండాలి.
– ప్రజా దర్బార్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
గ్రామ స్థాయిలో నాయకులు సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. బుచ్చిరెడ్డి పాళెం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు.బుచ్చి పట్టణ మరియు మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించి ఆమెకు వినతి పత్రాలను అందించారు. పక్కా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు కావాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు రావడంతో పేదల ఇళ్ల సమస్యలపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు స్పందించారు. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న పిఎంఎవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇంటి స్థలం వుండి ఇళ్ళు కట్టుకోవాలంటే సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఇళ్ల స్ధలాలు కావాల్సిన వారు విఆర్ఒ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. బుచ్చి పట్టణ పరిధిలో తొలి విడతగా 285 మంది లబ్దిదారులకు ఈ నెల 25 న ఇళ్ళు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. పక్కా ఇళ్ళు, ఇంటి స్థలాల కేటాయింపులో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని ఎంపికలో అవకతవకలకు పాల్పడితే సహించనని ఆమె అధికారులను హెచ్చరించారు.
నిరు పేదలకు ఇళ్ల కేటాయింపులో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇళ్ళు మంజూరు చేస్తామని ఆమె హామీ యిచ్చారు. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఒలు ప్రజలకు అందుబాటులో వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సూచించారు. కంప్యూటర్లు పని చేయడం లేదని కుంటి సాకులు చెప్పి లబ్దిదారుల ఎంపికలో జాప్యం జరగకుండా చూడాలని సచివాలయ సిబ్బంది మరియు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలం, ఇళ్ళు మంజూరు ప్రక్రియను మండల తహసీల్దారులు పర్వేక్షించాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు వారం రోజుల పాటు పేదలకు ఇంటి స్థలం, ఇళ్ళు మంజూరు కార్యక్రమం కోసం కేటాయించాలన్నారు. వివిధ సమస్యలపై అందించే వినతి పత్రాలపై ఆధార్ మరియు మొబైల్ నెంబర్ వేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అర్జీదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, ఎంపీపీ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ రూరల్ మరియు అర్బన్ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసరావు, టిడిపి మాజీ మండల అధ్యక్షులు మండల టిడిపి గౌరవ అధ్యక్షులు టంగుటూరు మల్లారెడ్డి, మండల బిజెపి, జనసేన నాయకులు టిడిపి యూనిట్, క్లస్టర్ మరియు బూత్ కమిటి కన్వీనర్లు పాల్గొన్నారు.