*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక గ్రీవెన్స్ లు*

*వైసీపీ పాలనలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు*

*మనుబోలులో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*అర్జీలు సమర్పించేందుకు వందలాదిగా తరలివచ్చిన ప్రజానీకం*

*అందరి సమస్యలను ఆలకించి, అర్జీలు స్వీకరించడంతో పాటు ప్రతి విన్నపాన్నీ ఆన్ లైన్ చేయించిన సోమిరెడ్డి*

*కార్యక్రమం ప్రారంభంలో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన జెడ్పీ హైస్కూలు చిన్నారులను అభినందించిన శాసనసభ్యులు*

*సోమిరెడ్డి కామెంట్స్*

మనుబోలు నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు

ఇప్పటికే వెంకటాచలం, పొదలకూరు మండలాల్లోనూ ఈ కార్యక్రమాలు పూర్తి చేశాం

ఇప్పటి వరకు ఆన్ లైన్ లో సుమారు 3 వేల వరకు అర్జీలు నమోదయ్యాయి.

అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై సమీక్షలు నిర్వహించుకుంటూ సమస్యలు పరిష్కరించాలి

త్వరలోనే తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లోనూ స్పెషల్ గ్రీవెన్సులు నిర్వహిస్తాం

సర్వేపల్లి నియోజకవర్గంలో వేలాది సమస్యలు పేరుకుపోవడం దురదృష్టకరం

ఎక్కువ శాతం అర్జీలు పింఛన్లు రావడం లేదని, ఇళ్ల స్థలాలు లేవని, ఇళ్లు మంజూరు చేయాలని కోరడంతో పాటు భూఆక్రమణలు, భూసమస్యల గురించే వస్తున్నాయి

ప్రతి ఊరిలో సచివాలయం ఉద్యోగులు 10 మందిపైగా ఉన్నా సమస్యలు ఇలా ఎందుకు పేరుకుపోయాయో అర్థం కావడం లేదు

అర్జీదారులు, బాధితుల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు, దళితులు ఆ తర్వాత బీసీలే

వైసీపీ ఐదేళ్ల పాలనలో పేదలు నలిగిపోయారు…గిరిజనులు కనీసం ఆధార్ కార్డులు పొందలేకపోయారు..పింఛన్లకు దూరమైపోయారు

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పెత్తనాలు చేసి ఇష్టానుసారంగా భూరికార్డులు మార్చేసుకోవడంతో సమస్యలు పెరిగిపోయాయి

ఇకపై అలా జరిగే ప్రసక్తే లేదు…వైసీపీ పాలనలో జరిగిన తప్పులన్నింటిని సరిదిద్దుతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed