*ప్రజా ఆకాంక్ష మేరకు సుపరిపాలన అందించ — వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*రూరల్లో ఏడాదిగా గొడవలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, వివాదాలు లేవు — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*రూ. 150 కోట్లతో ఏడాది కాలంలో అభివృద్ధి పూర్తి చేశా — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*రూ. 1500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*నాలుగేళ్లలో నాలుగు పనులు కూడా చేయని శ్రీధర్ రెడ్డి విమర్శలు చేయడం అర్ధరహితం — రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి చేసింది దౌర్జన్యాలు, అరాచకాలు, రౌడీయిజం, భూకబ్జాలు, దాడులు — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

9 సంవత్సరాలగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉండగా పలానా అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తాను ఏడాదికాలంగా నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నేటి వరకు 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్న ఐదేళ్ల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని 1500 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని ఆ దిశగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి అడుగులు ముందుకు వేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు తెలిపారు. *ఏడాదికాలంగా నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్ష మేరకు శాంతియుతమైన సుపరిపాలన అందించానని, ఏ ప్రాంతంలో కూడా గొడవలు గాని, వివాదాలు గాని, దౌర్జన్యాలు గాని, అరాచకాలు గాని, రౌడీయిజం గానీ, భూవివాదాలు గాని కనిపించకుండా ఉక్కుపాదంతో అణచివేయడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు*. తాను ఏ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయా ప్రాంతాల అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించి ప్రజల కోరికను నెరవేర్చనని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. *9 ఏళ్లుగా నెల్లూరు రూరల్ ప్రజలకు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసింది ఏమిటంటే….* మాట వినని వారిపై దాడులు చేయడం, వ్యాపారస్తులను బెదిరించడం, కమిషన్ల ఇవ్వకుంటే రౌడీయిజం చలాయించడం, భూకబ్జాలకు పాల్పడడం, హోటల్స్, రియల్ ఎస్టేట్ వారిపై దౌర్జన్యాలు చేయడం వంటి అసాంఘిక అరాచకాలు చేయడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం రూరల్ నియోజకవర్గం లోని రెండవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని అల్లిపురం, పెద్ద చెరుకూరు, గుడపల్లిపాడు ప్రాంతాలలో ఎన్నికల రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రెండవ డివిజన్ వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజలు, మహిళలు యువకులు అత్యధిక సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. గతంలో ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై అల్లిపురం, పెద్ద చెరుకూరు, గుడపల్లిపాడు ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈనెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, రెండవ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, ఓ మురళి రెడ్డి, వేడుచర్ల రాజారెడ్డి, నెల్లూరు ప్రసన్నకుమార్ రెడ్డి, లేబూరు పరమేశ్వర రెడ్డి, మూరేం ప్రతాపరెడ్డి తదితరులతో పాటు నియోజకవర్గం పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు సిహెచ్ హరిబాబు యాదవ్, లంక రామ శివారెడ్డి, హయత్ బాబా, వై వి హరీష్ రెడ్డి రెండవ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు యువకులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed