*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను* – కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. – రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం. – ప్రభుత్వం అధికారికంగా వారానికోసారి గ్రీవెన్స్ నిర్వహిస్తే తన నివాసంలో కోవూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. – కోవూరు నియోజకవర్గంలో 3 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న చంద్రబాబు నాయుడు. – పెన్షన్ల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

Byjanahushaar.com

May 1, 2025

*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను*

– కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం.
– రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం.
– ప్రభుత్వం అధికారికంగా వారానికోసారి గ్రీవెన్స్ నిర్వహిస్తే తన నివాసంలో కోవూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం.
– కోవూరు నియోజకవర్గంలో 3 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న చంద్రబాబు నాయుడు.
– పెన్షన్ల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామి నెరవేర్చి కోవూరు నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి సందర్భంగా కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి పల్లంరెడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టిడిపి,జనసేన,బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బంది ఇతర అధికారులతో కలిసి ఇల్లిల్లు తిరిగి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పెన్షన్ల పంపిణి చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం గుండాలమ్మ పాళెం గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డును ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేయడం ద్వారా ప్రతి నెల నేరుగా ప్రజలను కలిసే అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. ఎన్నికలలో చేసిన ప్రతి హామీ దశల వారీగా అమలు చేసుకుపోతున్నామంటూ మహిళలకు ఉచితంగా 3 సిలెండర్లు, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 ఆర్ధిక సహాయం పధకాలను ఉదహరించారు. రానున్న జూన్ నెలలో తల్లికివందనం పధకం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా అభివృద్ధి స్తంభించి అస్తవ్యస్థమైన రాష్టానికి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని 15 వ ఆర్ధిక సంఘ నిధుల సద్వినియోగం ద్వారా అభివృద్ధి పనులతో గ్రామాలకు పండుగ కళ వచ్చిందన్నారు. పంచాయతి రాజ్, విద్యాశాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గార్లు బాధ్యతలు చేపట్టాక ఇటు గ్రామీణాభివృద్ధి అటు విద్యాశాఖలో సమూల మార్పులు వచ్చాయన్నారు.

విజన్ 47 సాధనలో భాగంగా వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారన్నారు. కోవూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్య పీడితులకు 3 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్న మానవతావాది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు. ప్రభుత్వం అధికారికంగా వారానికోసారి గ్రీవెన్స్ నిర్వహిస్తే తన నివాసంలో కోవూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మండల ఇంచార్జిల పై కొందరుప్రచారం చేస్తున్న అపోహలను నివృత్తి చేస్తూ.. నాయకుల మధ్య సమన్వయం కోసమే ఇన్చార్జీలను నియమించినట్టు పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లతో పాటు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మిస్తున్నట్లు ఆమె గుండాలమ్మ పాళెం గ్రామస్థులకు హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, సర్పంచ్ దివ్యారెడ్డి, జడ్పీటీసీ సరోజనమ్మ, పెన్నాడెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మండల టిడిపి నాయకులు GVN శేఖర్ రెడ్డి, అమరేంద్ర రెడ్డి, స్థానిక నాయకులు పల్లంరెడ్డి సురేష్ రెడ్డి, సాయిమోహన్ రెడ్డి, సుజిత్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు నక్క శివకృష్ణ, బిజెపి నాయకులు చేకూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed