- – ప్రజాసేవే నారాయణ , వి ,పి ఆర్, గార్ల లక్ష్యం,.. చంద్రన్న పాలన వస్తేనే పేదలకు మేలు ……….. పొంగూరు రమాదేవి
- – ఏ ఇంటికి వెళ్లిన ఆత్మీయత చూపించి ఆశీర్వదిస్తున్న నగర ప్రజలకు రుణపడి ఉంటాను……..
———————————
🔸 నెల్లూరు నగరం 48వ డివిజన్ మీరా మొహిద్దిన్ దర్గా కోటమిట్ట పలు ప్రాంతాలలో…. మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గార్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు అవ్వ ,తాత ,బాగున్నారా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ను, మరెన్నో సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తామని ప్రజలకు సూచించారు నారాయణ, వి ,పి ,ఆర్ , సార్లను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ముందుగా డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమెకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
🔸 అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ నారాయణ గారు వి ,పి,ఆర్, గారు ఏదో ఆశించి సంపాదించడానికో రాజకీయాల్లోకి రాలేదని, తమ సొంత గడ్డ అయినా నెల్లూరు ను ఒక స్మార్ట్ సిటీ చేయాలని ప్రజలకు మంచి పనులు చేయాలన ఒక గొప్ప సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి మంచి మనసున్న వ్యక్తులను గెలిపించుకోవడానికి నెల్లూరు ప్రజలు డిసైడ్ అయిపోయామని ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు భరోసా ఇస్తున్నారని, వి ,పి ఆర్ గారు సెంటర్ నుండి నారాయణ సార్ రాష్ట్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారని తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్లను అంగవైకల్యం ఉన్నవారికి ఆరు వేల రూపాయలు పెన్షన్లు తలుపు తట్టి మరీ అందిస్తామని పార్టీలో కులాలు, మతాలు చూడకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని నగరంలో ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయత చూపించి ఆశీర్వదిస్తున్న నగర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బిజెపి ,పార్టీ నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు
🔸 తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరు నగర శానసభ్యులుగా పోటీచేస్తున్న పొంగూరు నారాయణ గారిని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు .