*ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : గుమ్మడి రాజా యాదవ్
*వెంకటాచలం మండలం నుండి వేలాదిగా తరలివచ్చి సోమిరెడ్డి గారికి మద్దతుగా నిలవండి*
*టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
పొదలకూరులోని గేటు సెంటర్ లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సంయుక్త సారధ్యంలో జరగనున్న ప్రజాగళం కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్నారు
కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను అంతమొందించడానికి సర్వేపల్లి ప్రజలు సైతం కదం తొక్కాలి
కాకాణి చేస్తున్న అరాచకాలతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడి మే 13న జరిగే ఎన్నికలలో కాకాణిని ఓడించి తోడేరు ఇంటికి సాగనంపుదాం
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, సోమిరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సర్వేపల్లి చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయండి
శనివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వెంకటాచలం మండలం నుండి ప్రతి ఒక్కరూ పొదలకూరులోని గేట్ సెంటర్ వద్దకు చేరుకొని సోమిరెడ్డి గారి సారధ్యంలో చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్న ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి