*ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందివ్వండి*
– CSR నిధులతో ఇందుకూరుపేట 20 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్ గ్రేడ్
– జొన్నవాడ, రామతీర్ధం PHCల వైద్య సిబ్బందిని ఆదర్శంగా తీసుకోండి.
– జాతీయ స్థాయిలో NQAS అవార్డుకు ఎంపికైన వైద్య సిబ్బందికి అభినందనలు.
– ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకై ప్రభుత్వం ఖర్చు చేసే కోట్లాది రూపాయలు సార్ధకం కావాలంటే వైద్య సిబ్బంది సహకారం అవసరమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ, రామతీర్ధం PHC లకు జాతీయ స్థాయిలో NQAS (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ సాధించిన సందర్భంగా డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది అభినందన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వున్న 58 PHC లకు గాను 2023 మరియు 2024 సంవత్సరాలలో వరుసగా కోవూరు నియోజకవర్గానికి చెందిన జొన్నవాడ, రామతీర్ధం PHC లకు జాతీయ స్థాయిలో NQAS(నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ దక్కడం గర్వంగా వుందన్నారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వైద్య సేవలందించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న జొన్నవాడ, రామతీర్ధం పి హెచ్ సి ల పనితీరును ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఆదర్శంగా తీసుకొని పని చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే పేదల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించాలని ఆమె డాక్టర్లకు సూచించారు. తాను కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నిరంతర ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో మార్పు వచ్చిందన్నారు. CSR నిధులతో ఇందుకూరుపేట 20 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 10 లక్షలు ఎంపి నిధులు వెచ్చించి మార్చురి నిర్మిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామతీర్ధం, జొన్నవాడ PHC కి చెందిన డాక్టర్ అమరేంద్ర రెడ్డి, అహమద్ బాషాలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.