*ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఉద్యోగులదే కీలకపాత్ర : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ప్రజలకు సేవలందించడమే కాదు..అవినీతి, అక్రమాలపైనా ఉద్యోగుల యూనియన్లు ప్రశ్నించాలి*
*ప్రభుత్వ పరంగా జరిగే లోపాలను ఎత్తి చూపాలి*
*వైసీపీ పాలనలో అప్పటి పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడి డిస్కమ్ లను అప్పులపాల్జేశారు*
*ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఉద్యోగులదే కీలకపాత్ర
కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాదు…మిగిలిన అంశాలపైనా ఉద్యోగులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
ఒక ట్రాన్స్ ఫార్మర్ ను మన రాష్ట్రంలో ఎంతకు కొనుగోలు చేస్తున్నారు..పొరుగు రాష్ట్రాల్లో ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి
2019 -24 మధ్య కాలంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది
ప్రతి ప్రభుత్వంలోనూ కొన్ని లోపాలుంటాయి. వాటిని కచ్చితంగా ఉద్యోగులే ఎత్తి చూపాలి
స్మార్ట్ మీటర్ ను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.7 వేలు, రూ.8 వేలకు కొనుగోలు చేస్తే ఏపీలో 3,4 రెట్లు ఎక్కువ పెట్టారు
ఎడాపెడా ధరల పెంపుపై నేను అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించాను
ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోళ్ల విషయంలోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డారు. మొత్తంగా వైసీపీ పాలనలో డిస్కమ్ ల నెత్తిన వేలాది కోట్ల అప్పు పెట్టిపోయారు
వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా రైతు పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించబోమని స్పష్టం చేసింది
ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేయనవసరం లేదు..కనీసం లోపాలను, అవినీతి, అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి