*”ప్రజలకు అందుబాటులో ఉంటాం” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:21-03-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండల నాయకులతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*స్క్రోలింగ్ పాయింట్స్:*
👉 సర్వేపల్లి ప్రజలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..
👉 ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వాటిల్లినా, అన్ని విధాలా అండగా నిలుస్తాం.
👉 కూటమి ప్రభుత్వంలో విధ్వాంస పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.
👉 ప్రజలకు ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లడం, పరిష్కారం కాకపోతే, న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల వివక్షత ప్రదర్శిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవ్వరినీ విడిచిపెట్టం.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గ్రామాలు, కూటమి ప్రభుత్వ అవినీతి పాలనలో దోపిడీకి గురవుతున్నాయి.
👉 పార్టీ కోసం చురుకుగా పనిచేసే సమర్థవంతమైన కార్యకర్తలను వివిధ స్థాయిలలో పనిచేసే పార్టీ కమిటీలలో స్థానం కల్పిస్తాం.
👉 స్థానిక కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి పార్టీ కమిటీలలో అవకాశం కల్పిస్తాం.
👉 రైతులు ధాన్యం అమ్ముకోవడానికి కూటమి ప్రభుత్వంలో అనేక ఇబ్బందుల పాలవుతున్నారు.
👉 జగనన్న ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ, జగనన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
👉జగనన్న 2.O లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తాం.
👉 ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా అతి పెద్ద సేవకుడిగా, నా సేవలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధం.