*ప్రచారం ముగింపు రోజు సరికొత్త జోష్*
*నగరంలో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ*
నెల్లూరు,మే,11
రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం, శ్రేయస్సు కోసం పరితపించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని కాంక్షిస్తూ శనివారం నెల్లూరు నగరంలోని నవాబు పేట నుండి ఆత్మకూరు బస్ స్టాండ్, కనక మహల్, పెద్ద బజార్, విఆర్‌సి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, రామమూర్తి నగర్ వరకు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి, సిటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,పార్టీ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డి నేతృత్వంలో
బైక్ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి సరికొత్త జోష్ నింపారు. స్వయంగా విజయసాయిరెడ్డి బైక్ నడిపి ర్యాలీని ఉత్తేజపరిచారు. ఈ ర్యాలీకి నగరంలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది..