పోలీసుల సేవలు వెలకట్టలేనివి
– కోవూరులో పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్, షటిల్ కోర్ట్ ప్రారంభోత్సవం.
– నేర నియంత్రణలో సిసి కెమెరాలది కీలక పాత్ర.
– VPR mining infra సహకారంతో మూడు పోలీస్ వెహికల్స్ అందజేత – శిథిలావస్థకు చేరిన కోవూరు పోలీసు స్టేషన్ పునరుద్ధరణకు సహకరిస్తాం.
– అరాచక శక్తులను అణిచి వేయండి.
– డ్రగ్స్ ను అరికట్టడంలో పోలీసుల పనితీరు చాలా బావుంది.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నేరాలు చేయాలంటే భయపడేలా అరాచక శక్తులను అణిచి వేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు అన్నారు. కోవూరు తహసిల్దార్ కార్యాలయ పరిధిలో ఆదివారం VPR మైనింగ్ ఇన్‌ఫ్రా సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటుచేసిన మూడు పోలీస్ వెహికల్స్ ను, సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ గారికి వేంరెడ్డి దంపతులు అందించారు. కోవూరు పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు షటిల్ కోర్ట్ ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెందిన VPR మైనింగ్ ఇన్‌ఫ్రా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 3 పోలీసు పెట్రోలింగ్ వాహనాలు మరియు 100 సిసి కెమెరాలు జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ గారికి అందచేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు సంబంధిన తాళాలు ఎస్పీ కృష్ణ కాంత్ గారికి అందచేయగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పచ్చ జెండా ఊపి పోలీసు పెట్రోలింగ్ వాహనాల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజి అందుబాటులోనికి వచ్చాక నేరాల నియంత్రణలో పోలీసులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. జిల్లాలో డ్రగ్స్ నివారించడంలో పోలీసుల పనితీరును ఆయన ప్రశంసించారు. చూడడానికి సౌమ్యులుగా వున్న ఎస్పీ కృష్ణకాంత్ నేరాల నియంత్రణలో అసాధ్యులని కొనియాడారు. VPR మైనింగ్ ఇన్‌ఫ్రా CSR నిధుల ద్వారా శిథిలావస్థకు చేరిన కోవూరు పోలీసు స్టేషన్ పునరుద్ధరిస్తామని అందుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని కోరారు.
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ VPR మైనింగ్ ఇన్‌ఫ్రా వారి సహకారంతో సమకూర్చిన పెట్రోలింగ్ వాహనాలు, సిసి కెమెరాల సహాయంతో కోవూరు పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. క్లిష్టమైన కేసులు ఛేదించడానికి సిసి కెమెరాలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. VPR మైనింగ్ ఇన్‌ఫ్రా ను ఆదర్శంగా తీసుకొని కార్పొరేట్ సంస్థలు పోలీసు వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. 3 పోలీసు మొబైల్స్ మరియు 100 సిసి కెమరాలు అందచేసిన వేమిరెడ్డి దంపతులకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కృతజ్ఞతలు తెలియచేసారు.
అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక శక్తులు రాజ్యమేలిన కోవూరులో అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారిని కోరారు. నేరాల చేయాలంటే భయపడేలా రౌడీ మూకలను ఉక్కుపాదంతో అణచి వేసి కోవూరులో ప్రశాంతత నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్ళు, కాలేజీలు మరియు బస్ స్టాండ్ల వద్ద నిఘా పెంచి అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అవినీతి రహిత, వివాద రహిత కోవూరు సాధన దిశగా పోలీసులు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు మల్లారెడ్డి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, ఎంపిపి తుమ్మల పార్వతి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి,బిజెపి,జనసేన నాయకులు పాల్గొన్నారు.