*పొన్నేబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిన కొండ్రెడ్డి*
మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ మామగారు పొన్నేబోయిన సుందర రామయ్య ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పొన్నేబోయిన సుందర రామయ్య కుమారుడు పొన్నేబోయిన ఓం ప్రకాష్ యాదవ్ ను నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా పొన్నేబోయిన సుందర రామయ్య చిత్రపటానికి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పొన్నేబోయిన సుందర రామయ్య కుమారుడు ఓం ప్రకాష్ యాదవ్ ను పరామర్శించిన వారిలో ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ పాశం శ్రీనివాస్ ఉన్నారు.