*” పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో కాకాణి పర్యటన”*
*కూటమిపాలనలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ, కాకాణి ముందు గోడు వెల్లబోసుకున్న స్థానికులు.*
*జగనన్న ప్రభుత్వంలో రైతుల దగ్గర పొలాలు కొని, లేఔట్లు వేసి తమకు ఇళ్ల ప్లాట్లు కేటాయిస్తే, తెలుగుదేశం పార్టీ వారు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని వాపోయిన బాధితులు.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరై తమకు వస్తున్న పెన్షన్లను బలవంతంగా నిలిపివేశారంటూ, ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధులు.*
*రైతులు పండించిన ధాన్యాన్నికి గిట్టుబాటు ధర లేదంటూ వాపోయిన రైతులు.*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:19-02-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, కళ్యాణపురం, పొదలకూరు గ్రామాలతో పాటు, వెంకటాచలం మండలం, చవటపాళెం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్:*
👉 *తెలుగుదేశం పార్టీ వారు అక్రమంగా ఆక్రమిస్తున్న పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను, వారు ఇళ్లు కట్టుకున్న సరే!, మన ప్రభుత్వం రాగానే, అసలైన లబ్ధిదారులకు తిరిగి అప్పజెబుతామని భరోసానిచ్చిన కాకాణి.*
👉 *జగనన్న పాలనలో అర్హులందరికీ పార్టీలకతీతంగా పెన్షన్లు పంపిణీ చేస్తే, తెలుగుదేశం పాలనలో ప్రతినెల కోతలు పెట్టడం అలవాటుగా మారిందన్న కాకాణి.*
👉 *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పుట్టి (850 కేజీలు) ధాన్యం 25 వేల రూపాయలు పలికితే, నేడు 16 వేలకు పడిపోయిందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా, కేవలం మాటలకే పరిమితమైందన్న కాకాణి.*
👉 *కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి, ఎలా పోరాటం చేస్తున్నారో అదే స్ఫూర్తితో, జిల్లాలో ఎదురయ్యే ప్రతి సమస్య పట్ల ప్రజలకు అండగా నిలిచి పోరాడుతాం.*
👉 *ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎటువంటి కష్టం రానివ్వకుండా, నష్టం కలగకుండా అన్ని విధాలా అండగా నిలుస్తామన్న కాకాణి.*
*కళ్యాణపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నపూస లక్ష్మణ రెడ్డి గారి పార్ధీవదేహానికి నివాళులర్పించడంతో పాటు, పొదలకూరు మండల కేంద్రంలో ఇటీవల మరణించిన విశ్రాంత ఉపాధ్యాయుడు నరసాపురం సుబ్బయ్య, బెల్లంకొండ ఆదిలక్ష్మమ్మల కుటుంబసభ్యులను, వెంకటాచలం మండలం, నిడిగుంటపాళెం గ్రామానికి చెందిన నెల్లూరు తులసిరామ్ లోక్ నాధ్ సింగ్, చవటపాళెం గ్రామానికి చెందిన తాళ్లపాక నరసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి.*