*పొదలకూరు ప్రజాగళం సభకు పోటెత్తిన సర్వేపల్లి ప్రజానీకం*
*సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది తరలివచ్చిన జనం*
*జనసంద్రాన్ని తలపించిన పొదలకూరులోని గేట్ సెంటర్*
*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన*
*కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించిన చంద్రబాబు నాయుడు*
*అక్రమ మైనింగ్ తో సర్వేపల్లిని కేజీఎఫ్ – 3 గా మార్చడంతో పాటు కరోనా ప్యాలెస్, భూకుంభకోణాలు, టీడీపీ శ్రేణులపై బనాయించిన అక్రమ కేసులు, దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం, నారాయణ కుటుంబానికి న్యాయం చేసేందుకు సోమిరెడ్డి చేసిన పోరాటం తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన సీబీఎన్*
*రాజకీయాల కోసం ఆస్తులను అమ్ముకుని నాలుగు సార్లు ఓడిపోయినా, డబ్బులు లేకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజాబలమే అండగా మీ ముందుకొచ్చిన సోమిరెడ్డిని ఆశీర్వదించాలని పిలుపు*
*అక్రమంగా వేల కోట్లు సంపాదించి, 10 వేలు చొప్పున కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేజీఎఫ్ గోవర్ధన్ రెడ్డిని తరిమికొట్టాలని ప్రజలను కోరిన చంద్రబాబు*
*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ మెజార్టీతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని తేల్చేసిన పొదలకూరు సభ*