*పేద ప్రజల విద్య, వైద్య, ఆర్థిక రంగాలలో అభివృద్ధి జగనన్న లక్ష్యం– వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*గడచిన నాలుగు సంవత్సరాలకు, తాను ఇన్చార్జిగా వచ్చిన 9 నెలలకు తేడాను గమనించండి — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*25 సంవత్సరాల రాజకీయ జీవితంలో కేవలం అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించాను. ఆ దిశగానే అడుగులు వేశాను– ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*కృష్ణపట్నం పోర్టు రాకతోనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి — రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*కలివేలపాలెం గ్రామంలో తాను ఇన్చార్జిగా ఉన్న సమయాల్లో తాను చేసిన నేటికీ అభివృద్దే కనబడుతుంది — ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల*

*కిక్కేరిసిపోయిన కలివెలపాలెం గ్రామం*

*కలివెలపాలెం గ్రామ టిడిపి యువ నాయకులు ఏలీయా రాజీనామా*

*మహిళల మంగళ హారతులతో జై జగన్, జై జగన్, జై ఆదాలన్న నినాదాలతో హోరెత్తిన కలివెలపాలెం*

*ఏలియాను అభినందించి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి*

*ఓపెన్ టాప్ జీపుపై నుండి ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి*

*హంగు ఆర్భాటాలు లేకుండా సాగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార రోడ్ షో*

*స్వచ్ఛందంగా తరలివచ్చి అభిమాన నాయకులు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపిన కలివెలపాలెం గ్రామస్తులు*

పేద ప్రజలను విద్య,ఆర్థిక రంగాల్లో అభివృద్ధి, వైద్య రంగంలో తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉన్నారని, నాడు-నేడు ద్వారా విద్య, ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు పెంచడం, ఆర్థికంగా అనేక సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం వంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలను అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కలివేలపాలెం గ్రామంలో తాను ఇన్చార్జిగా ఉన్న సమయాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ విషయాన్ని స్థానిక గ్రామస్తులు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో కేవలం అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించాలని ఆదిశగానే అడుగులు వేయడం జరిగిందని, ఎటువంటి వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాను సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంపూర్ణ సహకారంతో తీసుకురావడం జరిగిందని, తద్వారా ఎన్నో ఆయిల్ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలో, ఏర్పాటు కావడంతో దాదాపు 30 వేల మందికి ఉద్యోగ ఉపాధి కలిగిందని, ఈ ప్రాంతమంతా అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందింది అంటే తాను వలనేనని, మన ప్రాంతాల విలువ పెరిగింది అన్న విషయాన్ని ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఈనెల 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలం కలివెలపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా కలివెలపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేపట్టారు. *ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష జనవాహినితో కలివేలపాలెం గ్రామం కిక్కిరిసిపోయింది*. *జై జగన్, జై జగన్, జై ఆదాలన్న అనే నినాదాలతో కలివేలపాలెం గ్రామ పురవీధులు హోరెతాయి* . ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార రోడ్ షో సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో కలివేలపాలెం *గ్రామ టీడీపీ ముఖ్య యువ నాయకులు ఏలియా తెలుగుదేశం పార్టీకి రాజీనామా* చేసి స్వచ్ఛందంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కలివేలపాలెం గ్రామ టీడీపీ యువ నాయకులు ఏలియా ఆ పార్టీకి రాజీనామా చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాధ్యపడుతుందని ఆకాంక్షించి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారందరిని మనస్పూర్తిగా అభినందిస్తూ వారికి వైఎస్ఆర్సిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఏలియాకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం అందించారు. కలివేలపాలెం, పెనుబర్తి చెరువులో గిరిజన సంఘం, పెనుబర్తి గ్రామాలలో ఓపెన్ టాప్ జీపుపై ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించి అనంతరం ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పెనుబర్తి గ్రామానికి చెందిన పలువురు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. *ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పుచ్చలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, పులిగొండ్ల వెంకటేశాయ, గూడూరు సుధాకర్, కరీముల్లా, షబ్ జాన్, గులాం, చిట్టెటి శ్రీధర్ రెడ్డి, అలగర కిషోర్, పాటూరు సన్నీ, చింతల నిఖిల్, తోనేటి పవన్ తదితరులు ఉన్నారు* గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆకాంక్షించి స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందించి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో వారందరికీ అన్నివిధాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పెనుబర్తి గ్రామ ప్రజలు వైఎస్ఆర్సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షో సందర్భంగా పెనుబర్తి గ్రామ పురవీదులన్నీ జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మల్లెం సుదీర్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, పెనుబర్తి కలివెలపాళ్లెం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు పార్లపల్లి మధుసూదన్ రెడ్డి, పార్లపల్లి వీర రాఘవరెడ్డి, పోతుల అజయ్ కుమార్ రెడ్డి, చిల్లకూరు సుబ్బరామి రెడ్డి, పోతుల సుధాకర్ రెడ్డి, నిప్పట్ల ప్రసాద్, పడిగినేటి రమేష్, పాలూరు శేషారెడ్డి, కాలేషా, చాన్ బాషా, పెనుబర్తి గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు రమేష్, శేఖర్ రెడ్డి, రాజేష్ మురళి, తిరుమల, వెంకట శేషయ్యే, శ్రీనివాసులు రెడ్డి, మురళీ, ఏఎంసి వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, క్లస్టర్ అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి పాతపాటి ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు చిరమన శ్రీనివాసులురెడ్డి, జిల్లా యూత్ నాయకులు గుంటక వంశీ, కరిముల్లా, కలివేల పాలెం, పెనుబర్తి చెరువులో గిరిజన సంఘం, పెనుబర్తి గ్రామాల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed