పేదోళ్ల ఇళ్ళను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణం
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పై రఘురామ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలను చేయడం అమానుషం
ఉండి నియోజకవర్గంలో పేదోళ్ల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం, నష్టపరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా చేయడం అన్యాయమని ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసి అహంకారపూరితగా ధోరణి తో మాట్లాడిన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు వైఖరిని ఖండిస్తూ సిపిఎం నగర కమిటీ కమిటీ ఆధ్వర్యంలో
వెంకటేశ్వరపురం ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విద్యార్థి దశ నుండి ఉన్నత విలువలు సైదాంతిక రాజకీయ విలువలు కలిగిన వ్యక్తిగా జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.
శ్రామిక వర్గ పేదల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు. స్వార్థాలకు పార్టీలను మారుస్తూ నైతిక విలువలు కోల్పోయి జీవితాన్ని గడుపుతున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణను రాజు పేదోళ్ల ఇళ్లను తమ అధికారo తో దౌర్జన్యంగా కూల్చివేయడం అన్యాయమని అన్నారు. నష్టపరిహారం పునరావాసం లేకుండా ఇల్లును కూల్చివేసి ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు.
దీనిని ప్రశ్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు అహంకారపూరిత వైఖరితో చేయడం ఖండిస్తున్నామని అన్నారు. దీనిని బలపరుస్తున్న కూటమి ప్రభుత్వం ఫలితం అనుభవించక తప్పదని అన్నారు.
తక్షణమే అతని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేదోళ్ల ఇళ్ళకు పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మూలం ప్రసాద్
పి సూర్యనారాయణ, జి నాగేశ్వరరావు కత్తి పద్మ, జాఫర్
తదితరులు పాల్గొన్నారు